రాయలసీమలో టీడీపీ ఆఫీస్‌ల ముట్టడి  

Ycp Leaders Protest Against Rayalaseema Tdp Offices-ap Three Capitals,ycp Leaders

మండలిలో వికేంద్రీకరణ బిల్లును తెలుగు దేశం పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో చైర్మన్‌ సెలక్షన్‌ కమిటీకి పంపిన విషయం తెల్సిందే.సెలక్షన్‌ కమిటీకి వెళ్లడంతో ఇప్పట్లో మూడు రాజధానులు ఏర్పాటు అవ్వడం కష్టమే.

YCP Leaders Protest Against Rayalaseema TDP Offices-Ap Three Capitals Ycp

దాంతో మూడు రాజధానులను అడ్డుకుంటున్నారు అంటూ కర్నూలు సహా పలు రాయలసీమ జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు.వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లను ముట్టడించేందుకు ప్రయత్నించారు.


రాయలసీమకు రాజధాని రాకూడదనే ఉద్దేశ్యంతో రాయలసీమ అభివృద్దిని అడ్డుకునే ఉద్దేశ్యంతోనే తెలుగు దేశం పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారంటూ రాయలసీమ వైకాపా నాయకులు నేడు అంతా ఆందోళనలు చేశారు.ప్రభుత్వం తీసుకు వచ్చిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.

జిల్లాలో పలు చోట్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను తగులబెడుతూ పార్టీ జెండాలను మరియు ప్లెక్సీలను చింపేస్తూ నిరసన తెలియజేశారు.

తాజా వార్తలు

Ycp Leaders Protest Against Rayalaseema Tdp Offices-ap Three Capitals,ycp Leaders Related....