వైసిపి నాయకుల్లో రిలయన్స్ కలకలం ?

రెండు రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను స్వయంగా వచ్చి కలిశారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.అకస్మాత్తుగా జరిగిన ఈ భేటీపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 Ycp Leaders In Dailama About Jagan And Ambani Meets-TeluguStop.com

ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది అని, దానికోసమే ముకేశ్ అంబానీ స్వయంగా జగన్ కలిశారని ప్రచారం జరిగింది.అయితే అంబానీ వచ్చింది కేవలం వ్యాపార వ్యవహారాల మీద కాదని, రాజ్యసభ స్థానం గురించి జగన్ తో చర్చించేందుకు వచ్చారని, ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.

ముకేశ్ అంబానీ తో కలిసి పరిమళ నత్వానీ కూడా వచ్చారు.పరిమళ న్తవానీని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపించేందుకు ముకేశ్ అంబానీ జగన్ ఒప్పించారని ప్రచారం కూడా మొదలైంది.

ప్రస్తుతం ఏపీ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.ఈ నాలుగు వైసీపీ ఖాతాలోనే పడబోతున్నాయి.

దీంతో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఇలా చాలామంది ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

Telugu Apcm, Jagan, Ycpdailama, Ycp Rajyasabha-Political

ఆ నాలుగు రాజ్యసభ స్థానాలకు ఆశావాహులు చాలామంది పోటీలో ఉన్నారు.రాంకీ గ్రూప్ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి తో పాటు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మర్రి రాజశేఖర్, బీద మస్తాన్ రావు, పండుల రవీంద్ర బాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ వెళితే ఓ పదిమంది వరకు అత్యంత కీలకమైన నాయకులు రాజ్యసభ స్థానాల కోసం ఆశపడుతున్నారు.వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రెండు స్థానాలు కేటాయించినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

Telugu Apcm, Jagan, Ycpdailama, Ycp Rajyasabha-Political

ఇక మిగిలిన ఆ రెండు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనే క్లారిటీ లేకపోవడంతో చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బీజేపీతో అనధికార పొత్తు పెట్టుకోవడంతో ఒక స్థానాన్ని బిజెపికి కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.బిజెపి తరఫున చేస్తారని దానికోసమే ముకేశ్ అంబానీ నేరుగా జగన్ ను కలిసి చర్చించినట్లు ప్రచారం జరుగుతుండడంతో వైసీపీ నాయకుల్లో కలవరం మొదలైంది.పార్టీలోని వ్యక్తులకు కాకుండా, ఎక్కడో బయట రాష్ట్రాల వారిని ఎంపిక చేస్తే ఎలా అంటూ అప్పుడే అసంతృప్తి రాగం మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube