చినబాబు తగ్గేదే లే.. హర్ట్ అవుతున్న వైసీపీ నేతలు

ఇటీవల కొన్ని రోజుల క్రితం వరకు వైసీపీ నేతల కామెంట్లు గమనిస్తే ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ వస్తుంది.వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేశారు కానీ ఆయన పుత్రరత్నం నారా లోకేష్‌ చేసే ఆరోపణల గురించి అస్సలు పట్టించుకునేవాళ్లు కాదు అని.

 Ycp Leaders Getting Hurting Over Nara Lokesh Comments. Andhra Pradesh, Nara Lokesh, Ysrcp, Political Comments, Mlc Anantha Babu ,botsa Satyanarayana, Ambati Rambabu, Ys Jagan , Ap Poltics , Tdp, Chandra Babu Naidu-TeluguStop.com

మాజీ మంత్రిగా పనిచేసినా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నా లోకేష్‌ను తక్కువ అంచనా వేస్తూ ఆయన గురించి మాట్లాడటమే దండగ అన్నట్లు వైసీపీ నేతలు భావించేవాళ్లు.

అయితే నారా లోకేష్ తన స్ట్రాటజీ మార్చారు.

 YCP Leaders Getting Hurting Over Nara Lokesh Comments. Andhra Pradesh, Nara Lokesh, Ysrcp, Political Comments, Mlc Anantha Babu ,botsa Satyanarayana, Ambati Rambabu, Ys Jagan , Ap Poltics , Tdp, Chandra Babu Naidu-చినబాబు తగ్గేదే లే.. హర్ట్ అవుతున్న వైసీపీ నేతలు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పంచ్‌ల మీద పంచులు వేస్తూ వైసీపీ నేతలను చీల్చి చెండాడుతున్నారు.నా వెంట్రుక కూడా పీకలేరు.

ఇప్పటివరకు ఏం పీకారు.అన్న తరహాలో ఘాటైన పదజాలం వాడుతూ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు.

మునుపటితో పోలిస్తే దూకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం వైసీపీ నేతలు హర్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత్‌బాబు విషయంలో వైసీపీ నేతలపై ఓ రేంజ్‌లో లోకేష్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఏకవచనంతో పలువురు మంత్రులను టార్గెట్ చేస్తూ లోకేష్ వ్యాఖ్యానించడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు.

లోకేష్ బొత్తిగా మర్యాద ఇవ్వకుండా మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స సీరియస్ అయ్యారు.అసలు లోకేష్‌కు ఏం తెలుసు అని ఆయన కౌంటర్ ఇచ్చారు.

అయిన దానికి, కాని దానికి తమ మీదు విరుచుకుపడతారేంటి అని బొత్స సోమవారం నాటి ప్రెస్‌మీట్‌లో రుసరుసలాడారు.

ఇక మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన పూనకం వచ్చినట్లు లోకేష్ మీద గరం గరం అయ్యారు.లోకేష్ మొద్దబ్బాయి అని.

వెర్రి మాలోకం అని అంబటి రాంబాబు తన నోటికి పని చెప్పారు.లోకేష్ అమెరికాలో చదువుకున్నారో.

లేదా స్విమ్మింగ్ ఫూల్‌లో అమ్మాయిలతో బీరు తాగుతూ తిరిగాడో అంటూ ఆరోపించారు.లోకేష్ పిచ్చివాగుడు కట్టిపెట్టాలని హితవు పలికారు.

మొత్తానికి తనను పట్టించుకోకుండా కరివేపాకులా తీసిపడేస్తున్న వైసీపీ మంత్రులకు లోకేష్ తన ఉనికి బాగానే చాటుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube