ప్రతీకారం సరే జగన్ ... అది సానుభూతిగా మారితే ?

జగన్ రాజకీయం ఇప్పుడు సొంత పార్టీ నేతలకు సైతం రుచించడం లేదు.దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నేతలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగడమే.

 Ycp Leaders Concerned Over Arrest Of Tdp Leaders , Arrests, Dhulipalla Narendra-TeluguStop.com

నిబంధనల పేరుతో టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ,  వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ వివిధ కేసుల్లో వారి ప్రమేయంపై విచారణ చేయించడంతో పాటు , అరెస్టులు సైతం చేస్తుండడంతో టీడీపీ నేతలంతా భయాందోళనలో ఉన్నారు.  ఎప్పుడు ఎవరు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడింది.  ఆ పార్టీ తరఫున ఎవరు యాక్టివ్ గా ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.

గత టిడిపి ప్రభుత్వంలో వైసిపి విషయంలో ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించిన నాయకులు అందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా వివిధ కేసుల్లో జైలుపాలు అవుతున్నారు.

ఈ రకంగా జగన్ రాజకీయ పగ తీరుతోంది.

అయితే ఇది కాస్త సానుభూతి మారుతుందేమో అనే టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.గతంలో వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టిడిపి నేతలు వైసీపీ నాయకుల పై వేధింపులకు దిగడం,  వివిధ అక్రమ కేసుల్లో అరెస్టు చేయించడం,  వైసిపి అధినేత జగన్ ను అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు పాలు చేయడం,  ఇలా ఎన్నో అంశాలు వైసిపి క్రేజ్ తీసుకువచ్చాయి.

ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతి ఉపయోగించుకుని జగన్ జనంలోకి వెళ్లి పాదయాత్ర నిర్వహించి మరి అధికారాన్ని సొంతం చేసుకున్నారు.అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి తనను నమ్మి ఓట్లేసిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని జగన్ అన్ని సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు.

ఎప్పటికీ జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ఇప్పుడు జగన్ పార్టీ విధానాన్ని,  తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టు జనాల్లోకి తీసుకు వెళ్తున్న తెలుగు తమ్ముళ్లు జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Jagan Revenge, Kollu Ravindra, Tdp, Tdp Jail, Tdp

 జనాల్లోనూ జగన్ తీరుపై ఆలోచన మొదలయిందట.క్రమంగా అది కాస్తా టిడిపి పై సానుభూతి పెంచితే , ఆ సానుభూతిని ఉపయోగించుకుని టిడిపి బలపడేందుకు, రాబోయే రోజుల్లో అధికారం దక్కించుకునేందుకు రాజమార్గం అవుతుందనే అభిప్రాయం నేతల్లో కలుగుతున్నాయి.టిడిపిలో అచ్చెన్నాయుడు మొదలుకొని,  ఆ పార్టీ కి చెందిన మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు చాలామంది వివిధ కేసుల్లో జైలుపాలయ్యారు.  బెయిల్ పై బయటకు వచ్చి నానా హంగామా ఇప్పుడు సృష్టిస్తున్నారు.

ఇవన్నీ ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత పెంచితే,  రానున్న రోజుల్లో వైసీపీకి కష్ట కాలమే తీసుకు వస్తుంది అనే అభిప్రాయం అందరిలోనూ కనిపిస్తోంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube