పవన్ కళ్యాణ్ పెళ్ళాలు మార్చడానికి పనికొస్తాడు... వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రైతులని కలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ పర్యటన కొనసాగించారు.ఈ పర్యటనలో భాగంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

 Ycp Leaders Comments On Pawan Kalyan-TeluguStop.com

సుస్థిర పరిపాలన సాగిస్తారని ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇస్తే ఇప్పుడు రైతులని కన్నీరు పెట్టిస్తున్నారని అన్నారు.రైతులని కన్నీరు పెట్టించే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలవవని విమర్శలు చేశారు.

అంతటితో ఆగకుండా రాజధాని విషయ మీద వైసీపీ స్పష్టమైన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు.రైతులఐ అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

 Ycp Leaders Comments On Pawan Kalyan-పవన్ కళ్యాణ్ పెళ్ళాలు మార్చడానికి పనికొస్తాడు#8230; వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు-Telugu Political News-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటె రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో వైసీపీని టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేయడం మొదలెట్టారు.ఇప్పటిలానే పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సమస్యల మీద కాకుండా వైసీపీ నేతలు తమకి అలవాటైన భాషలో వ్యక్తిగత దాడి చేశారు.

ఇందులో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖానికి రంగులు వేసుకోవడానికి పెళ్ళాలని మార్చుకోవడానికే పనికోస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీడీపీ పరిపాలనలో రైతులని అన్యాయం జరిగితే ఒక్కరోజు కూడా ప్రశ్నించని పవన్ ఇప్పుడు టీడీపీ పార్టీ ప్యాకేజీ తీసుకొని రాజధాని వచ్చి రైతులని రెచ్చగొడుతున్నారని అన్నారు.

జగన్ అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలని చూస్తూ ఉంటె ఒక్క చోట కూడా గెలవని తుగ్లక్ ఇప్పుడు మొరుగుతున్నాడని విమర్శించారు.ఇదే దారిలో మంత్రి వెల్లంపల్లి కూడా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు.

మరి ఇదే దారిలో ఎంత మంది పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube