మిస్సోరి లో వైసీపీ కార్యకర్తల సంబరాలు  

Ycp Leaders Celebrations In Missouri-telugu Nri News,ys Jagan,ysrcp

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్క రాష్ట్ర,జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల తో వైసీపీ పార్టీ ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ అఖండ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి..

మిస్సోరి లో వైసీపీ కార్యకర్తల సంబరాలు -YCP Leaders Celebrations In Missouri

మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సైతం ఆటలు, పాటలతో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేషధారణలో వారంతా చేసిన ఆట,పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరూ వూహించని విధంగా వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ఆ పార్టీ విజయాన్ని అందుకోవడం తో టీడీపీ పార్టీ 23 సీట్ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో ఏపీ లో వైసీపీ అధినేత జగన్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 30 న ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.