జగన్ హెచ్చరిక : మారుతారా ..? మార్చేయమంటారా ..?

తెలంగాణాలో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటమి పాలవ్వడం తాను అంతర్గతంగా మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాలా ఖుషీగా కనిపిస్తున్నారు.ఇక తెలంగాణాలో ఉన్నట్టే ఏపీలోనూ … టీడీపీ గడ్డు పరిస్థితులే ఎదుర్కోవాల్సిందే అనే అంచనాకు జగన్ వచ్చాడు.

 Ycp Leader Ys Jagan Warn To Party Leaders-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న జగన్ తన సొంత మీడియా ద్వారా ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయంపై ఒక అవగాహనకి వచ్చాడు అంతే కాదు కేవలం తన సొంత మీడియాను నమ్ముకుంటే సరిపోదని మరో ప్రవేటు సంస్థతో మరో సర్వే ఇప్పటికే పూర్తి చేయించాడు.ఈ నివేదికల ఆధారంగా పార్టీ బలహీనంగా… ఉన్న నియోజకవర్గ ఇంచార్జీలకు హెచ్చరికలు జరీ చేసాడు జగన్.

ప్రస్తుతం రెండు సర్వేల ఆధారంగా మీకు ఈ హెచ్చరికలు చేస్తున్నా … మళ్ళీ చేయించే సర్వేలో మీ పనితీరు మారకపోతే మిమ్మల్ని మార్చడానికి వెనుకా ముందు ఆలోచించానని అది గుర్తుపెట్టుకుని పనిచేయాలని జగన్ వారికి సూచనలు చేసాడట.జగన్ తాను చేయించిన సర్వేల సమాచారం ఆధారంగా నియోజకవర్గాల వారీ నివేదికలను రూపొందించి వాటిని పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు అందించారు.అందులో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలవారీ పార్టీ పరిస్థితి, నాయకుల స్థితిగతులతోపాటు ఆయా సామాజికవర్గాల వారీ పార్టీకి, ప్రత్యర్థి పక్షాలకు ఉన్న సానుకూలతను కూడా పూర్తి వివరాలతో వారికి అందించారట.

వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే అంతిమ లక్ష్యం అన్నట్టుగా జగన్ కొన్ని కొన్ని మొహమాటాలను సైతం పక్కనపెట్టి ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు.ఇందులో భాగంగానే ఇప్పటికే మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని సైతం జగన్ పక్కనపెట్టేసాడు.ఇక జగన్ చేయించిన సర్వేల తీరును ఒకసారి పరిశీలిస్తే… ఈ సర్వేల్లో ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఆ నియోజకవర్గంలో పార్టీపరంగా వైసీపీ పరిస్థితి, అక్కడున్న పార్టీ ఎమ్మెల్యే లేక సమన్వయకర్త పనితీరు, అక్కడ ప్రత్యర్థి పార్టీ నాయకుల పరిస్థితి ఉలా ఉంది అన్న అంశాలపై ప్రధానంగా సర్వే చేయించారు.ఆయా సామాజికవర్గాల ఓటర్లలో ఎవరికి పట్టు ఉందన్న విషయం తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

అంతే కాదు చాలా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్టు కూడా సర్వేల్లో తేలడంతో ఈ విషయంపైనా జగన్ సీరియస్ గానే హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube