ఆ వైసీపీ సీనియ‌ర్ ఏ పార్టీలో ఉన్నా పొలిటిక‌ల్ మంట‌లే...!

ఏపీలో అధికార వైసీపీకి చెందిన సీనియ‌ర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కొద్ది రోజులుగా పార్టీలో గ‌రంగ‌రంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.గ‌త ఎన్నిక‌ల‌కు యేడాది ముందు వ‌ర‌కు టీడీపీలో ఉన్న ఆనం అప్పుడు ఆత్మ‌కూరు ఇన్‌చార్జ్‌గా ఉండేవారు.

 Ycp Leader Anam Ramanarayana Reddy Requesting For Mlc Post, ,ysrcp,aanam Ram Nar-TeluguStop.com

చంద్ర‌బాబుతో విబేధించి ఆయ‌న వైసీపీలో చేర‌డంతో జ‌గ‌న్ వెంక‌ట‌గిరి ప‌గ్గాలు ఇచ్చారు.గ‌త ఎన్నిక‌ల్లో ఆనం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ‌పై ఏకంగా 37 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

సీనియ‌ర్‌, మాజీ మంత్రి కావ‌డంతో త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆనం ఆశ‌లు పెట్టుకున్నారు.అయితే జ‌గ‌న్ ఆనంను ప‌క్క‌న పెట్టి ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్లు అయిన అనిల్ కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌతంరెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

ఆ త‌ర్వాత మంత్రి అనిల్‌తో ఏర్ప‌డిన కోల్డ్‌వార్‌తో ఆనం పార్టీ అధిష్టానంపై ఫైర్ అవ్వ‌డంతో పాటు ఓ రేంజ్‌లో గ‌రం గ‌రం లాడారు.చివ‌ర‌కు అధిష్టాన పెద్ద‌లు ఆనంకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఆనం వైసీపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నా గ్రూపులు కట్ట‌డంలో. ఆధిప‌త్య రాజ‌కీయాల‌తో రాజ్యం ఏల‌డంలో ఆరితేరిపోయారు.
అయితే వైసీపీలో ఆయ‌న మాట ఏ మాత్రం చెల్లుబాటు కాక‌పోవ‌డంతో ఇప్పుడు ర‌గిలిపోతున్నారు.1983లో టీడీపీలో ఉన్న‌ప్పుడు నాడు ఎన్టీఆర్ ఆనం సోద‌రుల‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో వారు ఆడిందే ఆట‌.పాడిందే పాట అయ్యింది.ఆ త‌ర్వాత ఆనం సోద‌రులు కాంగ్రెస్‌లోకి వెళ్లి అక్క‌డ ఓ వెలుగు వెలిగారు.2004 – 2014 మ‌ధ్య ప‌దేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండ‌డంతో ఆనం సోద‌రుల‌ది ఆడింది ఆట పాడింది పాట అయ్యింది.ఆ త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు వీళ్ల‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చ‌క‌పోవ‌డంతో ఆనం టీడీపీని వీడారు.

ఆ త‌ర్వాత ఆనంను వైసీపీలో చేర్చుకునేందుకు కొంద‌రు ఇష్ట‌ప‌డ‌లేదు.అయితే అప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ చేర్చుకోక త‌ప్ప‌లేదు.టీడీపీలో ఉన్న‌ప్పుడే త‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.ఇప్పుడు కూడా మంత్రి ప‌ద‌వి కావాల‌ని స‌తాయిస్తుండ‌డంతో జ‌గ‌న్ ఆనంను చాలా లైట్ తీస్కొన్నారు.

దీంతో ఆయ‌న రుస‌రుస‌లాట‌లు మామూలుగా లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube