వివాదంలో చిక్కుకున్న అంబ‌టి రాంబాబు.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు!

ఈ మ‌ధ్య వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఎక్కువ‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.ఆయ‌నపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మ‌ళ్లీ అదే పొర‌పాటు చేస్తున్నారు.

 Ycp Leader Ambati Rambabu Caught In Controversy-TeluguStop.com

కొన్ని సార్లు ఆవేశంతో నోరుజారుతున్నారు.ప్ర‌స్తుతం కూడా అలాగే నోరుజారి దారుణ‌మైన ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు.

అదేంటేంటే.ఓ విష‌యంపై అతిగా స్పందించ‌బోయి అన‌వ‌స‌ర కామెంట్లు చేశారు ఆయ‌న‌.

 Ycp Leader Ambati Rambabu Caught In Controversy-వివాదంలో చిక్కుకున్న అంబ‌టి రాంబాబు.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే ఇక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

రీసెంట్‌గా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అయితే ఇందులో చంద్రబాబుపై కామెంట్లు చేస్తూ అన‌వ‌స‌రంగా అతిగా స్పందించారు.ప్ర‌స్తుతుం ఏపీలో క‌రోనాతో జనాలు అల్లాడుతుంటే చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్ రాష్ట్రంలో ఉండ‌కుండా తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ఉంటారా అంటూ ప్ర‌శ్నించారు.

మ‌రి జ‌గ‌న్‌ కూడా ప‌ర్య‌టించ‌ట్లేదు క‌దా అని యాంక‌ర్ అడ‌గ్గా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.ఆయ‌నెందుకు తిర‌గాల‌ని ఎదురు ప్ర‌శ్నించారు.

ఇక ఇదే స‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర‌గంపై కూడా దారుణ‌మైన కామెంట్లు చేశారు.ప్ర‌స్తుం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న కాపుల‌కు పెద్ద‌గా తెలివి లేద‌ని చెప్పారు.అలాగే వారు ఎక్కువ‌గా ఆవేశపరుల‌ని, మాంసం ఎక్కువ‌గా తింటార‌ని, మ‌ద్యానికి బానిస‌లుగా త‌యార‌య్యార‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు ఆయ‌న‌.

Telugu Ambati Ram Babu, Ambati Rambabu Trolled, Ap And Ycp, Ap Cm Jagan, Ap Corona, Chandrababu, Kapu Social Caste, Nara Lokesh, Netizens, Survey, Trolling, Ycp Leaders-Telugu Political News

దీంతో మీరేమైనా కాపుల‌పై స‌ర్వే చేశారా అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా తన‌కు అన్నీ తెలుస‌ని స‌ర్వే అస‌వ‌రం లేద‌న్నారు.అయితే ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు దారుణంగా ఆయ‌న్ను ఆడేసుకుంటున్నారు.కాపు వ‌ర్గానికి చెందిన వారు దుమ్మెత్తి పోస్తున్నారు.

అంబ‌టికి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇలాంటి వ్య‌క్తికి ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండే అర్హ‌త లేదంటూ మండిప‌డుతున్నారు.

ఇంకొంద‌రేమో అధికార గ‌ర్వం అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా అంబ‌టి కాస్త నోటి జారుడుత‌నాన్ని త‌గ్గించుకోవాల‌ని సూచిస్తున్నారు మ‌రికొంద‌రు.

మ‌రి దీనిపై అంబ‌టి ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.

#Kapu #AP CM Jagan #Ambati Ram Babu #Netizens #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు