కరోనా సమయంలో కంగారెందుకు బాబు ?

కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.ఈ విపత్తు సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ దేశం నుంచి కరోనా ను తరిమికొట్టలని సహకరిస్తున్నారు.

 Ap Cm Jagan, Chandrababu, Tdp, Corona, Nizamuddin-TeluguStop.com

ఈ సందర్భంగా అన్ని రాజకీయాలను, వైరాలను పక్కన పెట్టి అంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు.ఇక కేరళలో అయితే అధికార ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు అంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా మీడియా సమావేశం నిర్వహించారు.

ఉమ్మడిగా కరోనా ను అడ్డుకుంటామంటూ, దీనికోసం పార్టీలకతీతంగా తాము సహకరించుకుంటూ వారు దేశానికి మంచి సందేశాన్ని పంపించారు.ఇక ఏపీ విషయానికి వస్తే మొదట్లో కరోనా కేసుల సంఖ్య అదుపులో ఉన్నట్టు గా కనిపించినా ఆ తరువాత మెల్లిగా కేసుల సంఖ్య పెరుగుతోంది.

దీనికి కారణం ఢిల్లీ మార్కస్ ప్రార్ధన కి వెళ్లి వచ్చిన వారే కారణం.అయితే దీని పైన టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయడం చంద్రబాబు తీరుపై ఆగ్రహం కలిగిస్తోంది .రాజకీయాలు ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు.అయితే ఆ సమయంలో అంతా కలిసికట్టుగా ఉండి ప్రజల సంక్షేమం, బాగోగులు చూడాల్సి ఉంది.

కానీ అవేవి పట్టించుకోకుండా కేవలం రాజకీయాలే మాకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు కారణమవుతోంది.

Telugu Ap Cm Jagan, Chandrababu, Corona, Nizamuddin-Telugu Political News

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి జగన్ కారణమని బాబు ఆరోపణలు చేస్తున్నారు.వాస్తవంగా ఏపీలో ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఈ పరిస్థితి కాల్ ఎత్తింది అంతకు ముందు పరిస్థితి ఎలా ఉందో అందరికీ బాగా తెలుసు.ఆయనా ఏదో రకంగా ప్రజల్లో జగన్ ఇమేజ్ తగ్గించాలి అన్నట్టుగా చంద్రబాబు పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీలో కేసుల సంఖ్య పెరిగినట్లు చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు.అధినేత వ్యవహారం ఇలా ఉంటే మిగతా టిడిపి నాయకులు కూడా ఇదే విధంగా వైసీపీ ప్రభుత్వం పై మరకలు అంటించేదుకు ప్రయత్నించడం ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోంది.

విపత్తు సమయంలోనూ ఈ విధంగా రాజకీయాలు చేయడం అవసరమా అనే సలహాలు, సూచనలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube