రాజు గారి కథ క్లైమాక్స్ కే ? ఆ ప్లాన్ వేసిన వైసీపీ ? 

151 మంది ఎమ్మెల్యేలు , 21 మంది ఎంపీలు ( నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మినహాయించి ) ఉన్న అతి పెద్ద పార్టీ వైసీపీ ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ చర్యలతో నే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఎంపీ రఘురామ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ, పార్టీని మరింతగా దెబ్బతీస్తున్న తీరు వైసీపీ అధినేత జగన్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

 Ycp Is Trying To Disqualify Mp Raghurama Krishnam Raju , Mp Raghurama Krishnam R-TeluguStop.com

ఆయన దూకుడుకు కళ్లెం వేయకపోతే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని జగన్ అంచనా వేస్తున్నారు.ఒకపక్క రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి జైలుకు పంపించినా, ఆయన బెయిల్ పై వచ్చి చేయాల్సిన హడావుడి అంతా చేస్తున్నారు.

తనను వైసిపి ప్రభుత్వం ఎంతగా బాధిస్తుందో చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా ఎంపీలందరికీ లేఖలు రాశారు.అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరికీ ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు లు చేస్తున్నారు.

తనను పోలీసు కస్టడీలో కొట్టారు అంటూ ఆయన హడావుడి చేస్తున్నారు.దీంతో దేశవ్యాప్తంగా జగన్ ప్రభుత్వానికి వచ్చిన క్రెడిట్ మొత్తం రఘురాము వ్యవహారంతో పోతుండడంతో జగన్ సైతం అలర్ట్ అయ్యారు.

ఏదో రకంగా రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని తేల్చకపోతే ముందు ముందు మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న జగన్ రఘురామ దూకుడుకు కళ్లెం వేసే లా వ్యూహాలు రచిస్తున్నారు.దీనిలో భాగంగానే వైసిపి ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సందర్భంగా మొదటి నుంచి రఘురామకృష్ణంరాజు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలతో పాటు, దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అన్నిటినీ లోక్ సభ స్పీకర్ కు చూపించి ఆయనపై వేటు వేయాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నారు.ఇక ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలతో ఈ విషయంపై చర్చించి, వారి వద్ద నుంచి రఘురామ వ్యవహారంలో స్పష్టమైన హామీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
  ఇప్పటికే అమిత్ షా వంటి వారి అపాయింట్మెంట్ కోరినా అది దొరకకపోవడంతో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు.

Telugu Amith Sha, Ap, Jagan Delhi, Jagan, Loksabhaspeeker, Modhi, Mpraghurama, S

మరోసారి మోదీ అమిత్ షా ల అపాయింట్మెంట్ తీసుకుని రఘురామ పై ఫిర్యాదు చేయాలనే ఆలోచనలు జగన్ ఉన్నారు.ఇప్పటి వరకు ఆయన వ్యవహారంపై అనేక ఫిర్యాదులు చేసినా,  ఢిల్లీలో ఆయనకు ఉన్న పలుకుబడి కారణంగా కేంద్ర బీజేపీ సైతం రఘురామ విషయంలో సానుకూలంగా ఉండటం జగన్ కూ ఆగ్రహం తెప్పిస్తోంది.తాము బిజెపి కి ఆపద సమయంలో సహకారం అందిస్తూ వస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అంటూ జగన్ సైతం తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

ఇక ఆటో ఇటో రఘురామ వ్యవహారం తేల్చేయాలని , ఈ విషయాన్ని ఎక్కువ రోజులు సాగదీస్తే తమ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిప్రాయానికి వచ్చిన జగన్ రఘురామ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అయ్యరు.రఘురామ పై అనర్హత వేటు వేయించడమే ఏకైక లక్ష్యంగా ఇప్పుడు వైసిపి వ్యూహాలు రచిస్తోంది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube