ఆ టీడీపీ సీనియ‌ర్‌ ఇలాకాలో వైసీపీ ఇంత వీకా...!  

YCP is so weak in that TDP senior constituency,ap,ap political news,latest news,ysrcp,political war,constituency,thota vani,not active in politics,peddapuram,jagan mohan reddy,tdp,tdp leaders,chandra babu - Telugu Ap, Ap Political News, Chandra Babu, Constituency, Jagan Mohan Reddy, Latest News, Not Active In Politics, Peddapuram, Political War, Tdp, Tdp Leaders, Thota Vani, Ysrcp

ఏపీలో అధికార వైసీపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ పార్టీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది.

TeluguStop.com - Ycp Is So Weak In That Tdp Senior Constituency

వీరితో పాటు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే  మద్ధతు కూడా వైసీపీకి ఉంది.దీంతో 156 ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉంది.

అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 156 చోట్ల వైసీపీకి తిరుగులేదు.అయితే అధికారంలో ఉండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం కనిపిస్తోంది.

TeluguStop.com - ఆ టీడీపీ సీనియ‌ర్‌ ఇలాకాలో వైసీపీ ఇంత వీకా…-Political-Telugu Tollywood Photo Image

కాకపోతే కొన్నిచోట్ల టీడీపీకి వైసీపీ చెక్ పెట్టలేకపోతుంది.అలా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్దాపురం కూడా ఒకటి.ఇక్కడ టీడీపీ తరుపున మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పనిచేస్తున్నారు.టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రాజప్ప, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

అనేక ఏళ్ల పాటు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా పని చేసి, పార్టీని నిలబెట్టారు.

Telugu Ap, Ap Political News, Chandra Babu, Constituency, Jagan Mohan Reddy, Latest News, Not Active In Politics, Peddapuram, Political War, Tdp, Tdp Leaders, Thota Vani, Ysrcp-Telugu Political News

అలా పార్టీ కోసం పనిచేసిన రాజప్పకు, 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇచ్చారు.చినరాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.అలాగే రాజప్పకు తన కేబినెట్‌లో హోమ్ మంత్రి పదవి ఇచ్చారు.

ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే, రాజప్ప టీడీపీ తరుపున గెలిచారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.

అలాగే చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

ఇక ఇక్కడ వైసీపీవీక్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ఓడిపోయిన తోట వాణి పార్టీలో యాక్టివ్‌గా లేరు.దీంతో వైసీపీ అధిష్టానం ఆమెని సైడ్ చేసేసి, దవులూరి దొరబాబుని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

అధికార నేతగా దొరబాబు నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు.కాకపోతే ఇక్కడ రాజప్ప బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు.

గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇంకా పెద్దాపురంలో కనిపిస్తోంది.పైగా వైసీపీ వచ్చాక పెద్దగా అభివృద్ధి జరిగినట్లు కనిపించడం లేదు.

దీంతో పెద్దాపురం ప్రజలు ఇంకా రాజప్ప వైపే ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికైతే పెద్దాపురంలో రాజప్ప ముందు వైసీపీ తేలిపోతున్నట్లే కనిపిస్తోంది.

.

#TDP Leaders #Constituency #Political War #Ysrcp #Peddapuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు