యాక్షన్ రియాక్షన్ : టీడీపీ దీక్ష వర్సెస్ వైసీపీ దీక్ష !   

 ఏపీలో వైసిపి టిడిపి మధ్య వార్ మరింత తీవ్రం అయిపోయినట్టు కనిపిస్తోంది.వైసిపి శ్రేణులను రెచ్చగొట్టే విధంగా టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి జగన్ ను ఉద్దేశించి చేసిన విమర్శలపై వైసిపి ఆగ్రహం చెందడం, ఆ పార్టీకి చెందిన వారు టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి దిగడం, దానికి నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టడం , ఈ వ్యవహారాలపై డిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లడం తదితర పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి .

 Ycp Initiation To Compete With Tdp Initiation, Tdp, Ysrcp, Ap, Bjp, Congress, Sa-TeluguStop.com

అయితే కేవలం బందుకు పిలుపు ఇచ్చి సరిపెట్టడం కంటే దీని తీవ్రతను జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యే విధంగా  చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు.దీనిలో భాగంగానే 36 గంటల పాటు దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
    ” ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు ”  పేరుతో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష జాతీయ స్థాయిలో ఫోకస్ విధంగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.

అయితే దీని ద్వారా టిడిపికి క్రెడిట్ రాకుండా చేసేందుకు వైసీపీ కూడా రంగంలోకి దిగింది.వైసీపీ జనాగ్రహ దీక్షలను తెరపైకి తీసుకువచ్చింది.టిడిపి నాయకులు చేసిన బూతు వ్యాఖ్యలకు నిరసనగా నే రెండు రోజులపాటు జనాగ్రహా దీక్షలకు వైసిపి పిలుపు ఇచ్చింది.ఏపీ సీఎం జగన్ పైన వైసీపీ ప్రభుత్వం పైన టిడిపి నేతలు బూతులు తిట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున జనాలను సమీకరించి జానాగ్రహ దీక్షలు చేపట్టాలని వైసీపీ ప్లాన్ చేసుకుంది.
 

Telugu Ap Cm, Chandrababu, Congress, Jagan, Ysrcp-Telugu Political News

 అలాగే జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈ దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.దీంతో టిడిపి దీక్షకు కౌంటర్ గానే వైసిపి ఈ జనాగ్రహ దీక్షను ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube