ఏపీలో వైసీపీ... తెలంగాణ‌లో బీజేపీ... జీవితా రాజ‌శేఖ‌ర్ డ‌బుల్ పాలి ' ట్రిక్స్ '

జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ? ఏ క్ష‌ణానికి ఏ పార్టీ కండువా కప్పుకుంటారో కూడా అర్థం కాని ప‌రిస్థితి.ఇటీవ‌లే క‌రోనా భారీన ప‌డి తీవ్ర అనారోగ్యానికి గురైన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

 Ycp In Ap ... Bjp In Telangana ... Jeevita Rajasekhar Double Poly 'tricks', Ap,-TeluguStop.com

ఇక ఈ దంప‌తుల పార్టీ జంపింగ్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో జంపింగ్ చేశారు.జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు తాజాగా బీజేపీలో చేరారు.

హైద‌రాబాద్ బీజేపీ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జీవిత ఒక్క‌రే పాల్గొన్నారు.చివ‌ర‌కు వీళ్లు ఎంత చుల‌క‌న అయ్యారంటే తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జీవిత‌కు బీజేపీ కండువా క‌ప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

దీంతో ఆమే త‌న‌కు తానేగానే కండువా క‌ప్పుకున్న ప‌రిస్థితి.

అంద‌రికి కండువాలు క‌ప్పిన సంజ‌య్ జీవిత‌కు కండువా క‌ప్ప‌క‌పోవ‌డంతో కొంత సేపు వేచి చూసిన జీవిత చివ‌ర‌కు త‌నంత‌ట తానే స్వ‌యంగా బీజేపీ కండువా క‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

ఇక 2014 ఎన్నిక‌ల త‌ర్వాతే వాళ్లు బీజేపీలో చేరారు.దీంతో ఇప్ప‌టి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి జీవిత‌కు సెన్సార్ బోర్డు ప‌ద‌వి కూడా ఇప్పించారు.ఆ త‌ర్వాత టీడీపీలోకి వెళ్లారు.మ‌ళ్లీ వైసీపీలో చేరి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశారు.

ఇక ఓ సారి వెనక్కు వెళితే ప్ర‌జారాజ్యం టైంలో చిరు ఫ్యామిలీని గ‌ట్టిగా ఎటాక్ చేశారు.

Telugu Bandi Sanjay, Telangana, Ysrcp-Telugu Political News

దీంతో వైఎస్ వాళ్ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి .మంచి ప్ర‌యార్టీ ఇచ్చారు.వైఎస్ చ‌నిపోయాక వైసీపీలోకి వెళ్లారు.ఆ త‌ర్వాత వైసీపీ నేత‌లు రాజ‌శేఖ‌ర్‌ను రావొద్ద‌ని అన్నార‌ని ఆరోపించి బీజేపీలో చేరారు.2014 త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీతో స‌న్నిహితంగా ఉన్నారు.కానీ.టీడీపీ వాళ్లు కండువా కప్పేంత ధైర్యం చేయలేదు.ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు.అయినా జ‌గ‌న్ వీళ్ల‌కు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.

దీంతో జీవిత తెలంగాణ వ‌ర‌కు చూసుకుంటోన్న ప‌రిస్థితి.

జీవిత తెలంగాణ‌లో బీజేపీలో ఉంటే.

రాజ‌శేఖ‌ర్ ఏపీలో వైసీపీలో ఉన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది.తెలంగాణలో బీజేపీ ఊపు మీద ఉండటం.

కేంద్రంలోనూ అధికారంలో ఉండటంతో.ఏదో ఓ ప్రాధాన్యత దక్కుతుందని ఆశ పడుతున్నారు.

అయితే కండువాయే వేయ‌ని బండి సంజ‌య్ ఆమెకు ప‌ద‌వి వ‌చ్చేందుకు ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది సందేహ‌మే.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube