బ‌ద్వేల్ లో స్పీడ్‌ పెంచేసిన వైసీపీ.. కీల‌క నేత‌లంతా రంగంలోకి

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి.ఇక ఉప ఎన్నికల వేళ రాజకీయాలు మరింత రంజుగా మారుతాయి.

 Ycp Has Increased The Speed In Boudwell .. All The Key Leaders Have Entered The-TeluguStop.com

ఈ వ్యాఖ్యలకు తాజా బద్వేల్ ఉప ఎన్నికలే నిదర్శనం.అక్కడ వైసీపీ సిట్టింగ్ స్థానమైనా సరే ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణించడంతో టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి.కానీ బీజేపీ మాత్రం బద్వేల్ లో పోటీ చేస్తుంది.

దీంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీఅభ్యర్థి ఇక్కడ భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు.

కానీ ఎమ్మెల్యే అయిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో కన్ను మూశారు.ఈ కారణం చేతే అక్కడ బై పోల్స్ అనివార్యమయ్యాయి.

ఈ బైపోల్స్ లో అత్యధిక మెజార్టీ సాధించాలని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.అందుకోసం వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.తాజాగా అక్కడ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా ప్రచారం చేపట్టారు.రోజా సినిమా డైలాగులు విసిరి బద్వేలు ఓటర్లలో జోష్ నింపితే చెవిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలతో తన మార్కును చూపెట్టాడు.

మాజీ సీఎం చంద్రబాబును చెవిరెడ్డి ఇక్కడ కూడా వదల్లేదు.మామకు వెన్నుపోటు పొడిచాడంటూ ఆరోపించారు.

మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ర్టానికి వెన్ను పోటు పొడిచాడని తెలిపారు.

Telugu Ap Poltics, Badwell, Chandra Babu, Tdp, Ys Jagan, Ysrcp-Telugu Political

బద్వేలు నియోజకవర్గం సీఎం సొంత జిల్లాలో ఉండడం గమనార్హం.ఇక్కడ అక్టోబర్ 30 న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఎవరు గెలిచారో తెలిసిపోతుంది.

పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, వైసీపీ నాయకులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఎలాగైనా సరే గెలిచి పరువు నిలుపుకోవాలని బీజేపీ చూస్తుండగా.

భారీ విజయం సాధించి ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను చూపించుకోవాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube