ఆ నిర్ణ‌యం వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోందా..?

ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు తీసుకునే ఏ నిర్ణ‌యం అయినా స‌రే చాలా జాగ్ర‌త్త‌గా ముందు చూపుతో ఆలోచించి తీసుకోవాలి.లేక‌పోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

 Ycp Govt Ys Jagan Mutton Marts-TeluguStop.com

ముందు చూపు లేకుండా తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌తి పార్టీని కూడా ఇబ్బందుల్లోనే ప‌డేస్తుంది.ఇక ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కూడా పార్టీని ఇబ్బందుల్లో ప‌డేసింది.

దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో చివ‌ర‌కు ఆ విష‌యంలో ఏకంగా వెనకుడుగు వేయాల్సి వ‌చ్చింది.అదేంటంటే ఇటీవ‌ల మటన్ మార్టుల ఏర్పాటుకు జ‌గ‌న్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 Ycp Govt Ys Jagan Mutton Marts-ఆ నిర్ణ‌యం వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో సాక్షిలోనే ఓ పెద్ద ఆర్టికల్ రావ‌డం, అలాగే న్యూస్ లో కూడా దానికి పూర్తి వివ‌రాలు ఇవ్వ‌డం చేశారు.అన్ని మీడియాలో కంటే ముందుగా సాక్షిలోనే ఇది ప‌బ్లిష్ అయింది.

ఇక ఇందులో జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకొస్తున్న సరికొత్త మటన్ మార్ట్ లు ఎలా ఉండ‌బోతున్నాయో వాటిని ఎలా నిర్వ‌హిస్తారో పూర్తిగా వెల్లడించారు.అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా కూడా ఇటీవ‌ల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ప్రభుత్వం ఇలా మటన్ వ్యాపారం చేయటమేంట‌ని అంద‌రూ వ్య‌త‌రేకించారు.

ఇక టీడీపీ కూడా దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది.ప్రభుత్వం రాష్ట్రంలో బాగా న‌డుస్తున్న మటన్ వ్యాపారంపై ఆదాయం సంపాదించాల‌ని ఇలా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.ఇక అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా మటన్ మార్ట్ ల వ్యవహారంలో వెనకడుగు వేయడం సంచ‌ల‌నం రేపుతోంది.

ఇక ఇదే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓ విధంగా విమ‌ర్శ‌లు తీసుకొస్తే ఇప్పుడు మంత్రి అప్పలరాజు చేసిన ప్రకటన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.త‌మ‌కు ఇలా మ‌ట‌న్ మార్టులు పెట్టాల‌నే ఆలోచ‌న లేద‌ని, ఎల్లో మీడియాలో కావాల‌ని దీనిమీద రాద్దాంతం చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు.

ఇక్క‌డే అంద‌రూ ఆయ‌న్ను తప్పు పడుతున్నారు.మొద‌ట సాక్షిలోనే కథనం వచ్చిన‌ప్పుడు ఇలా ఎలా మాట్లాడుతార‌ని తిట్టి పోస్తున్నారు.

#YSJagan #APMutton #JaganSell #AP #Mutton Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు