వైసీపీ యాక్షన్ ప్లాన్ ! గుక్క తిప్పుకోలేని టీడీపీ ?

వైసిపి యాక్షన్ ప్లాన్ లో దిగిపోయింద తమకు రాజకీయంగా ఎప్పటికైనా ఇబ్బందికరంగా మారుతారు అని భావిస్తున్న ఒక్కో టీడీపీ నేత టార్గెట్ గా పావులు కదుపుతోంది.అందరి ఆస్తిపాస్తులు పైన, అవినీతి వ్యవహారాలు పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.

 Ycp Government Focuses On Corruption Of Tdp Leaders-TeluguStop.com

తమకు ప్రతిపక్షం అనుకున్న ఎవర్ని ఉపేక్షించబోము అన్నట్లుగానే వ్యవహరిస్తోంది.ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం కలల రాజధానిగా ఉన్న విశాఖను టార్గెట్ చేసుకుని అక్కడ టీడీపీకి బలమైన నేతలు ఎవరు అనే ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.

ఒక్కో నేతకు సంబంధించిన అవినీతి కేసులను,  అక్రమ ఆస్తులను బయటకి తీస్తూ,  వాటిని ధ్వంసం చేస్తూ జైలు పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.టిడిపికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా అండదండలు అందిస్తారు అనుకుంటున్న వారందరినీ ఇప్పుడు టార్గెట్ చేసుకుంది.

 Ycp Government Focuses On Corruption Of Tdp Leaders-వైసీపీ యాక్షన్ ప్లాన్ గుక్క తిప్పుకోలేని టీడీపీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిలో భాగంగానే విశాఖ జిల్లా కు సంబంధించిన టిడిపి కీలక నేతల ఒక్కొక్కసారి అవినీతి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.  మొదట్లో ఈ వ్యవహారాలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారినా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అనే ప్రచారం జరిగినా, ప్రభుత్వం ఎక్కడా వెనుకడగు వేయలేదు.

అయితే ఒక్కో నేత అవినీతి వ్యవహారం బట్టబయలు కావడం, పెద్ద ఎత్తున భూకబ్జాలు బయటికి వస్తుండటంతో జనాల్లోనూ ఒక అభిప్రాయం కలుగుతోంది.టిడిపి ప్రభుత్వంలో ఎంతో మంది నాయకులు భూకబ్జాలకు పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టారని ఆధారాలతో సహా బయటకి వస్తున్నాయి.

తాజాగా విశాఖ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యవహారం బయటకి వచ్చింది.దాదాపు 800 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమిని పల్లా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆక్రమించారని రెవెన్యూ అధికారులు అభియోగం మోపారు.

విశాఖలో బయటపడిన భూ కుంభకోణాలు ఇదే పెద్దదిగా అధికారులు చెబుతున్నారు.కేవలం విశాఖ నేతలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి నాయకులు, రాబోయే ఎన్నికల్లో ఆర్థిక అండదండలు అందిస్తారు అనుకున్న వారందరికీ పైన వైసిపి టార్గెట్ పెట్టడం , పక్క ఆధారాలతో సహా అవినీతి వ్యవహారాలు బయటకు తీస్తూ వుండటంతో దీనిపై గట్టిగా గొంతెత్తలేని పరిస్థితి నెలకొంది.

#Jagan #VizagTDP #Vizag #Ysrcp #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు