'ఏపీ దిశ యాక్ట్‌' పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెల్సిందే.ఇప్పటికే దిశ లాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే కొత్త బిల్లు తీసుకు రాబోతున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించిన విషయం తెల్సిందే.

 Ycp Governament Launch The Ap Disha Act-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం తీసుకు రాకముందే ఏపీ ప్రభుత్వం కొత్త చట్టంను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని జగన్‌ మంత్రి వర్గం చెప్పుకొచ్చింది.

అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించేందుకు గాను ఏపీ దిశ యాక్ట్‌ను తీసుకు వచ్చారు.

ఏపీ దిశ యాక్ట్‌ ప్రకారం అత్యాచార ఘటన జరిగి పూర్తి ఆధారాలు ఉంటే వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.

మొత్తం 21 రోజుల్లోనే తీర్పు వెలువరించాలి.ఆ తర్వాత నెల రోజుల్లోనే తుది తీర్పు రావాల్సి ఉంటుంది.ఈ యాక్ట్‌ ప్రకారం అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తులు పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపితం అయితే నెల రోజుల్లో ఉరి శిక్ష పడుతుంది.కాని సుప్రీం కోర్టుకు నింధితులు వెళ్తే మాత్రం మళ్లీ పాత కథే.వారికి మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తూనే ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube