టీడీపీ కార్యాలయాన్ని కూల్చేస్తారా ? బాబు అడ్డుకుంటారా ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు తెలుగుదేశం పార్టీపై ఉన్న కోపం ఇంకా చల్లారినట్టుగా కనిపించడం లేదు.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ వ్యవహారాలు చేస్తూనే వస్తున్నారు.

 Ycp Governament Focusing Tdp Office Felt Down In Mangalagiri, Tdp Officess, Ap E-TeluguStop.com

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్టపై తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని సైతం జగన్ కూల్చివేశారు.ఇక తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ అనేక వ్యవహారాలు చేస్తూనే వస్తున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని వారిని తమ దారిలోకి తెచ్చుకున్నారు.ఇలా ఎన్ని రకాలుగా అవకాశం దొరికితే అన్ని రకాలుగానూ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్నారు.

వచ్చే నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎటువంటి పరిస్థితి తలెత్తిందో అదేవిధంగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితిని తీసుకురావాలని జగన్ బలంగా ఫిక్స్ అయిపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈసీ నిర్ణయం బాగా కలిసి వచ్చింది.

అలాగే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికలు వాయిదా పడడం తెలుగుదేశం పార్టీకి ఆనందాన్ని కలిగిస్తోంది.ప్రస్తుతం ఏపీ లో వాతావరణం నెలకొంది.రాజకీయాలను పక్కన పెట్టి కరోనా గురించి చర్చించుకుంటున్నారు.నాయకులు కూడా అన్ని విషయాలను పక్కనపెట్టి ఇళ్ల కే పరిమితం అయిపోయారు.

ఇదే అదునుగా భావిస్తున్న వైసిపి ప్రభుత్వం అమరావతి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేసి వాటి పరిధిలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు మేరకు ఈ స్థలాలను ప్రభుత్వపరం చేసే విధంగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

మంగళగిరి ప్రాంతంలోని ఆత్మకూరులో టిడిపి రాష్ట్ర కార్యాలయం ఉంది.ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ కార్యాలయం కోసం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఏపీ క్యాబినెట్ కేటాయించింది.

Telugu Ap Amaravathi, Apcm, Ap Pone, Coronaap, Akarsh, Tdp Amaravathi-Political

33 ఏళ్ల పాటు ఈ స్థలాన్ని లీజు కిం కేటాయించారు.దీంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని చదును చేసి భవన నిర్మాణం కూడా పూర్తి చేశారు.ఇప్పుడు దీనిపైన వైసిపి దృష్టిపెట్టింది.ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేకపోవడంతో కార్యాలయం కూల్చివేతకు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.భవనాన్ని కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.ఈ విషయం తెలుగుదేశం పార్టీకి సమాచారం అందడంతో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జగన్ నిర్ణయాలపై కోర్టులకు వెళ్లి పై చేయి సాధిస్తున్న టిడిపి ఈ విషయం లోనూ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.దీనిపై రాజకీయ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో వైసిపి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube