కొత్త వారితో వైసీపీకి కొత్త తలనొప్పులు తప్పవా ? టీడీపీ ఏం చెప్తోంది ?

వైసీపీ ‘గాలి’ ఏపీలో బలంగా పెరిగినట్టు కనిపిస్తోంది.దీంతో అధికార పార్టీ టీడీపీ నుంచే కాకుండా మిగతా పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి.

 Ycp Getting New Tensions Over Newcomers From Other Parties-TeluguStop.com

వస్తామని రాయబారం పంపుతున్న నాయకులందరినీ ముందు వెనుకా చూడకుండా పార్టీలో చేర్చేసుకుంటూ… జగన్ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు.ఇప్పటికే టీడీపీలో ఉన్న బలమైన సిట్టింగ్ లు వైసీపీలో చేరిపోయారు.

టికెట్ హామీ కూడా తమదే అన్నట్టుగా వారు ప్రకటించేసుకుంటున్నారు.ఇక్కడే వైసీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

దీంతో పాటు కొత్తగా పార్టీలో చేరే నాయకులతో పార్టీకి ఏ మేర లాభం చేకూరుతుంది అనే కొత్త వాదనలు కూడా తెరమీదకు వస్తున్నాయి.

ఇప్పటికే అమలాపురం ఎంపి రవీంద్ర బాబు టీడీపీ నుంచి వైసిపిలోకి జంప్ చేశారు.దీనికి కారణం ఆయనకు టికెట్ దక్కే అవకాశమే లేదని పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందడమే కారణం.ఆ ఎఫెక్ట్ తో రవీంద్రబాబు వైసీపీలో చేరిపోయారు.

అయితే ఇక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం మొదలయ్యింది.తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు.

అలాగే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడాన్ని ఆ పార్టీలో కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు.ఆయనకు భీమిలిలో ప్రజాధారణ లేదని, టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమే అంటూ ముందుగానే వైసీపీలో కొంతమంది కొత్త రాగం అందుకున్నారు.

టీడీపీ, వైసీపీలో చేరుతున్న నాయకుల విషయంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.వైసీపీలో కి బలహీన నేతలే వలస వెళ్తున్నారని, టీడీపీ లోకి వచ్చే నాయకులు మాత్రం బలమైన వారంటూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొస్తోంది.కర్నూల్ జిల్లాలో బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కోట్ల కుటుంబం తమ పార్టీలో చేరేటం బాగా కలిసి వస్తుందని టీడీపీ ధీమాగా చెప్తోంది.అలాగే ఉగ్రనరసింహరెడ్డి చేరికతో కనిగిరిలో టీడీపీకి మైలేజ్ పెరుగుతుందని, కాకినాడలో చెలమలశెట్టి సునీల్ రావడం, విశాఖలో కొణతాల రామక్రిష్ణ, కర్నూలుకు చెందిన గౌరు దంపతులు, సబ్బంహరి లాంటి నేతలు ప్రజల్లో పట్టున్న నేతలు పార్టీలోకి రావడం తమకు కలిసి వస్తుందని టీడీపీ వాదిస్తోంది.

కేవలం టికెట్ రాదు అని డిసైడ్ అయినవారు మాత్రమే వైసీపీలో చేరుతున్నట్టు టీడీపీ విమర్శిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube