చీరాల ర‌గ‌డ‌పై వైసీపీ అంత‌ర్మ‌థ‌నం.. క‌ర‌ణానికి స్ట్రాంగ్ వార్నింగ్.. ‌?

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం వేట‌పాలెం మండ‌లంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య తాజాగా జ‌రిగిన ర‌గ‌డ‌పై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది.ఇటీ వ‌ల వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం.

 Ycp Gave Strong Warning To Karnam On Chirala Issue, Ycp, Karanam, Karanam Balara-TeluguStop.com

టీడీపీ నాయ‌కురాలు.ఎమ్మెల్సీ (ఇటీవ‌ల రాజీనామా చేశారు) పోతుల సునీత‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.

పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో క‌ర‌ణం మ‌ద్ద‌తు దారు, మాజీ మంత్రి పాలేటి రా మారావు.మాట్లాడుతూ.క‌ర‌ణంకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ క‌ర‌ణ‌మే గెల‌వాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.అయి తే.ఇదే స‌భ‌లో ఉన్న సునీత‌.ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.ఇది రాజ‌కీయ స‌భ‌కాద‌ని.ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మ‌మ‌ని.దీనిపై మాట్లాడాల‌ని చెప్పారు.

పార‌ద‌ర్శ‌కంగా, నిస్ప‌క్ష‌పాతంగా చూస్తే.సునీత చెప్పిన దానిలో ఎలాంటి త‌ప్పు క‌నిపించ‌డం లేదు.ఇంటి ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఇలా వ్య‌క్తిగ‌త ప్ర‌శంస‌ల‌కు, మ‌రో మూడేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌సంగాలు చేయ‌డం, మ‌ళ్లీ క‌ర‌ణ‌మే ఎమ్మెల్యే కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్ప‌డం వంటివి స‌హ‌జంగానే ఏవ‌గింపుగా ఉన్నాయి.దీంతో సునీత‌.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించి.దీనిని రాజ‌కీయ వేదిక చేయొద్ద‌ని.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంద‌ని.పాలేటి ఏమీ.పార్టీ అధినేత కాద‌ని కూడా త‌న‌దైన శైలిలో వాదించారు.

Telugu Ap Cm, Chirala, Karanam, Karanam Balaram, Balineni, Ys Jagan, Ysrcp-Telug

నిజానికి ఒంట‌రిగా పోరాడినా.సునీత‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.అయితే.

క‌ర‌ణం మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రించి.మ‌హిళ అని కూడా చూడ‌కుండా .ప‌క్క‌కు లాగేసి.కూర్చీలో కుదేశారు.

ఈ ప‌రిణామం తీవ్ర ర‌గ‌డ‌కు దారితీసింది.అనంతరం.

మాట్లాడిన క‌ర‌ణం.సునీత మాట‌ల‌ను స‌మ‌ర్ధించ‌డం  గ‌మ‌నార్హం.

ఇది రాజ‌కీయ వేదిక‌కాదన్న‌ది వాస్త‌మే అని అంటూనే.త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను కూడా గుర్తు పెట్టుకోవాలంటూ.

హెచ్చ‌రించారు.మొత్తంగా ఈ విష‌యం పార్టీ అధిష్టానం వ‌ర ‌కు చేరిపోయింది.

దీంతో వీడియోల‌ను హుటాహుటిన తెప్పించుకున్న పార్టీ కీల‌క నేత‌, సీఎం స‌ల‌హాదారు.స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దృష్టి పెట్టారు.

అంతేకాదు.మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఈ ర‌గ‌డ‌పై నివేదిక కోరిన‌ట్టు తెలిసింది.మొత్తంగా జ‌రిగిన ప‌రిణామాల‌ను చూస్తే.ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటారు? ఎవ‌రు.వెన‌క్కి త‌గ్గాల‌నే సంకేతాల‌ను పార్టీ ఇస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది.ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌తో క‌ర‌ణంకు త‌లంటేందుకు పార్టీ సిద్ధ‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube