ర‌ఘురామ‌కు మ‌రో షాక్ ఇచ్చిన వైసీపీ.. భ‌గ్గుమ‌న్న రెబ‌ల్ ఎంపీ!

ఎంపీ ర‌ఘురామ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజ‌కీయాల్లో కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారారు.ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారాయి.

 Ycp Gave Another Shock To Raghuram Rebel Mp Fires-TeluguStop.com

మొన్న‌టి వ‌ర‌కు రఘురామ ఢిల్లీలోని కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌గా క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వంపై, జ‌గ‌న్‌పై ఫిర్యాదులు చేశారు.అలాగే ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌కు, తోటి ఎంపీల‌కు లేఖ‌లు రాయ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

 Ycp Gave Another Shock To Raghuram Rebel Mp Fires-ర‌ఘురామ‌కు మ‌రో షాక్ ఇచ్చిన వైసీపీ.. భ‌గ్గుమ‌న్న రెబ‌ల్ ఎంపీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జ‌గ‌న్ కూడా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసారు.

మ‌రీ ముఖ్యంగా ర‌ఘురామ వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ తిరిగి రాష్ట్రానికి వ‌చ్చిన త‌ర్వాత ప్లాన్‌ను వ‌ర్కౌట్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే రాజ‌మండ్రి ఎంపీ భ‌ర‌త్‌కుమార్ లోక్ స‌భ స్పీక‌ర్‌ను క‌లిశారు.

తమ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న ర‌ఘురామ‌పై అనర్హత వేటు వేయాల‌ని కోరారు.దీంతో ర‌ఘురామ‌పై యాక్ష‌న్ తీసుకునేందుకు రెడీ అయిన‌ట్టు జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చేశారు.

Telugu Ap And Ycp, Ap Politics, Jagan, Loksabha Speaker, Raghu Rama Krisha Raju, Raghu Rama Name Removed, Rajahmundry Mp Bharath Kumar, Tirupati Mp Gurumoorty, Ycp Website-Telugu Political News

ఇదిలా ఉండ‌గా ఈ రోజు మ‌రో షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత‌లు.ఈరోజు రెబ‌ల్ ఎంపీ రఘురామ పేరును వైసీపీ పార్టీ అధికార వెబ్ సైట్ నుంచి తొల‌గిస్తూ షాక్ ఇచ్చారు.పార్టీ పెద్ద‌లు రీసెంట్‌గా వైసీపీ వెబ్ సైట్‌లో త‌మ ఎంపీల జాబితాను స‌వ‌రించారు.ఈ స‌వ‌ర‌ణ‌లో భాగంగా తాజాగా తిరుపతి నుంచి ఎంపీగా గెలిచిన గురుమూర్తి పేరును చేర్చారు.

కానీ ర‌ఘురామ పేరును మాత్రం తొల‌గించారు.దీంతో త‌మ పార్టీ నుంచి తొల‌గించిన‌ట్టు అయింది.

ఇదే వ్య‌వ‌హారంపై ర‌ఘురామ స్పందించారు.త‌నను పార్టీ నుంచి తొల‌గించారా అంటూ ప్ర‌శ్నించారు.

కానీ త‌న పార్లమెంట్ ప‌ద‌విని మాత్రం ట‌చ్ చేయ‌లేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

#Ycp Website #Loksabha #AP #RaghuRama #AP YCP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు