వైసీపీ నుంచీ వలసలు మొదలయ్యాయా ?  

Ycp Former Ministers Join To Bjp Party-andhra Pradesh,chandrababu,jagn,join In Bjp Party,ministers,telangana,ycp

ఏపీలో తెలుగుదేశం పార్టీని కనుమరుగుచేయడమే తమ లక్ష్యం అన్నట్టుగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీసింది. అసలే కేంద్ర అధికార పార్టీ కావడంతో సహజంగానే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వలస వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు..

వైసీపీ నుంచీ వలసలు మొదలయ్యాయా ?-Ycp Former Ministers Join To Bjp Party

ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ చాలా ఖుషి అయ్యింది. ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఈ విధంగానే బీజేపీ ముందుకు వెళ్తోంది.ఏపీ నుంచి ఇప్పటికే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులను చేర్చుకుని బలపడాలని చూస్తోంది. ఇప్పుడు మాత్రం బిజెపి కన్ను వైసిపి మీద పడినట్టు కనిపిస్తోంది. బీజేపీకి ఇప్పుడు ప్రధాన టార్గెట్ వైసీపీగానే కనిపిస్తోంది.

ముఖ్యంగా వైసీపీకి చెందిన కీలక నాయకుడికి స్థానం దక్కలేదు. దీనిపై ఇప్పటికే ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఆ మాజీ మంత్రిని జగన్ అసలు పరిగణలోకి తీసుకోవడంలేదట.

ఒకప్పుడు జిల్లాలో తన మాటే శాసనంగా తన హవా చూపించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు నియోజకవర్గానికి పూర్తిగా పరిమితమైపోయారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వాస్తవంగా ఉత్తరాంధ్రలో బీజేపీ అంత బలంగా లేదు..

రాజకీయంగా అనుభవం ఉన్న ఇలాంటి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరితే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రిని తీసుకోవడానికి కొందరు బీజేపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అటు వైఎస్ హయాంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు మన పార్టీలోకి తీసుకుంటే ఆ మచ్చ మన మీద పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ప్రస్తుతం ఏపీలో పార్టీకి కీలక నాయకుల అవసరం కాబట్టి ఎవరు ఇలాంటివారు అయినా వారు పార్టీలోకి వచ్చినా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చేర్చుకోవాలని చెబుతున్నారట.

అందులోనే ఇప్పుడు వస్తానని చెబుతున్న వ్యక్తి సిట్టింగ్ ఎమ్యెల్యే కాబట్టి తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారట.