' జగన్ బెయిల్ రద్దు ' పై వైసీపీ సీరియస్ ? రంగంలోకి సీఐడీ ?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలో కానీ , సోషల్ మీడియాలో కానీ తమ పైన, తమ ప్రభుత్వం పైన వచ్చే వ్యతిరేక కథనాలపై సీరియస్ గానే దృష్టి సారిస్తోంది.సోషల్ మీడియాలో జగన్ పైన, వైసిపి పైన అసత్య కథనాలు ప్రచురించిన ఎంతోమందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

 Ap Cid, Ap Cm Jagan, Ysrcp, Tdp, Chandrababu, Jagan Viral News, Ysrcp Mlc Lella-TeluguStop.com

కొద్దిరోజులుగా ఆ తరహా వ్యవహారాలు ఏమి చోటుచేసుకోలేదు.అయితే జగన్ అక్రమాస్తుల కేసులో వ్యవహారంలో ఆయన బెయిల్ పై ఉన్నారు .దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ వేయడం తో మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే జగన్ బెయిల్ రద్దు అవుతుంది అంటూ వాట్స్అప్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది.

Telugu Ap Cid, Ap Cm Jagan, Chandrababu, Jagan, Ysrcp, Ysrcpmlc-Telugu Political

దీనిపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ గా దృష్టి పెట్టింది.జగన్ బెయిల్ రద్దు అయితే కనుక వైసిపి నాయకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడతారు అని,  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అప్రమత్తంగా ఉండాలంటూ వైరల్ అవుతున్న కథనాలపై వైసిపి సిఐడి దృష్టికి తీసుకు వెళ్ళింది.దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తమ ఫిర్యాదులో పేర్కొంది.ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం సంబంధించి రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ న్యాయస్థానం లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈ బెయిల్ వ్యవహారం పై ఈరోజు సిబిఐ న్యాయస్థానం తీర్పు వెలువరిస్తోంది.  న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జగన్ బెయిల్ రద్దు అవుతుంది అంటూ కథనాలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లోను వైరల్ అవడం పై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏపీ సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు.
 

Telugu Ap Cid, Ap Cm Jagan, Chandrababu, Jagan, Ysrcp, Ysrcpmlc-Telugu Political

జగన్ బెయిల్ రద్దు అవుతుంది అని , తీర్పు వెలువడే రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు , కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని,  ముఖ్యంగా అనంతపురం, కడప, కృష్ణ ,గుంటూరు , ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గానికి చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చివరకు పోలీసులను కూడా నమ్మ వద్దంటూ ఆ కథనాల్లో ఉన్నట్లుగా లేళ్ల అప్పిరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కల్పిత కథనాలన్నీ ప్రజల్లో ఆందోళన పెంచేందుకు, విద్వేషాలు రగిల్చెందుకు కారణం అవుతుందని,  ఈ విధంగా ఈ వైరల్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారని,  ఇటువంటి న్యూస్ ను తొలగించడంతో పాటు,  వీటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube