ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్ స్వీప్.... కార్యకర్తల సంబరాలు!  

Ycp Clean Sweep In Ap Elections!-chandrababu Naidu,exit Poll Results,next Cm Of Ap,pawan Kalyan Janasena,ycp Clean Sweep,ys Jagan

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగగా, ఇప్పటివరకు 144 స్థానాల లో వైసీపీ ఆధిక్యం లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 30 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది..

ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్ స్వీప్.... కార్యకర్తల సంబరాలు! -YCP Clean Sweep In AP Elections!

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు అర్ధం అవుతుంది. ఏపీ మంత్రులు చాలా మంది కూడా తమతమ నియోజక వర్గాల్లో వెనుకంజ లో ఉండడం టీడీపీ మరోసారి గద్దె ఎక్కే అవకాశాలు ఆవిరైనట్లే కనిపిస్తుంది. మరోపక్క తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ సత్తా చాటుతున్నారు..

25 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా… 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క వైజాగ్ లో జనసేన అభ్యర్థి జె.డీ.

లక్ష్మినారాయణ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడకుండానే వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు.