ఏపీలో వైసీపీ ప్రభంజనం.. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ గాలి బలంగా వీస్తుందే.. ?

ఏపీలో ప్రస్తుతం వైసీపీ హవా జోరుగా కొనసాగుతుందని అర్ధం అవుతుంది.వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పధకాలకు ఆకర్షితులు అవుతున్న ప్రజలు మరోసారి కూడా వైసీపీకి అధికారం కట్టబెట్టినా ఆశ్చర పోవలసిన అవసరం లేదు.

 Ycp Candidates Unanimous On Municipal-TeluguStop.com

ఇకపోతే ఏపీలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు కూడా విజయవంతగా నిర్వహిస్తోంది.

కాగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసింది.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇప్పటికే పుంగనూరు, మాచర్ల మున్సిపాటీలు పడిపోయాయి.ఈ రెండు మున్సిపాలిటీల్లో 31 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది వైసీపీ.

ఇదిలా ఉండగా అధికార వైసీపీ బుట్టలో తమ అభ్యర్థులు పడకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడుతుంది.అదీగాక కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే నిన్న ఒక్కరోజే 222 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.పలు చోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ అవడంతో టీడీపీ పరిస్దితి బోనులోపడ్ద ఎలుకలా తయారు అయ్యిందట.

ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీ పరువు కాపాడుకోలేక పోయిందట.దీన్నిబట్టి ఏపీలో వైసీపీ ప్రభంజనం జోరుగా సాగుతుండగా, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ గాలి బలంగా వీస్తుందనదంలో సందేహం లేదని అనుకుంటున్నారట పార్టీ శ్రేణులు.

#Unanimous #YCP Candidates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు