వైసీపీలో ఈ విధంగా జరుగుతోందా ?

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్లు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు లోలోపల తమ ఆనందాన్ని పాట రూపంలో పడుకున్నారట.తమ పార్టీ గెలుపు పక్కా అంటూ చెప్పుకుంటూ గెలిచాక ఏమి చేయాలనే లెక్కల్లో ఉన్నారు.

 Ycp Candidates Feeling Happy-TeluguStop.com

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాలనే కృత నిశ్చయంతో ఉన్న జగన్ ఈసారి ఫలితాల రోజు అద్భుతం జరగడం ఖాయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.కానీ ప్రస్తుతానికి జగన్ మాత్రం అజ్ఞాతంలో ఉన్నాడు.

ఎవరికీ అందుబాటులో లేకుండా పార్టీ విషయాలేమి ఆలోచించకుండా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాడు.

పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఒకటి రెండు రోజులు మాత్రమే జగన్ చురుగ్గా రాజకీయాల్లో పాలుపంచుకున్నారు.

కానీ ఆ తరువాత విదేశీ టూర్ కి వెళ్ళి వచ్చారు.అప్పటి నుంచి జగన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు.ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటికే అనేక విశ్లేషణలు, సర్వేలు వైసీపీ గెలవబోతోందని తేల్చేశాయి.దీంతో ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ పార్టీలో పెద్ద ఎత్తున మొదలైంది.

ఎన్నికల ప్రచార సమయంలో కొంత మందికి మంత్రి పదవులు ఇస్తానని స్వయంగా జగన్ ప్రకటించినా ఆ తర్వాత మాత్రం జగన్ ఎవరికీ హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

-Telugu Political News

చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో తన తమ గొంతు బలంగా వినిపించిన నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా ఈసారి గెలిచి మంత్రి పదవి చేపట్టడం గ్యారంటీ అంటూ ప్రచారం జరుగుతోంది.కాకపోతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నాయకులను కాదని రోజుకు మంత్రిగా అవకాశం దక్కడం అసంభవమని మరికొందరు వాదిస్తున్నారు.

ఆమెకు చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.ఇలా వైసీపీలో ప్రతి నేతకు ఆ పదవి దక్కుతుంది ఈ పదవి దక్కుతుందని చర్చ పెద్ద న్యూసెన్స్ గా మారడంతో ఇప్పుడు ఎవరూ పదవుల గురించి చర్చ పెట్టడవద్దని, ఫలితాలు వచ్చిన తరువాత ఆ సంగతి చూద్దామని పార్టీ అగ్ర నాయకులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube