టీడీపీ పట్టాభి మాల్దీవులకు వెళ్లారా ?

Ycp Campaign As Telugudesam Party Spokesperson Pattabhi Went To Maldives

నాలుగైదు రోజులుగా ఏపీలో టీడీపీ మధ్య రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొనడంతో,  ఈ వ్యవహారానికి అసలు సూత్రధారి గా పేరు పడ్డ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టించింది.ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యక్తిగత దూషణకు దిగడం, దీనిపై ఆగ్రహం చెందిన వైసీపీ శ్రేణులు టిడిపి ప్రధాన కార్యాలయంతో పాటు, పట్టాభి ఇంటిపై దాడికి దిగడం, ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు, అరెస్టు కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 Ycp Campaign As Telugudesam Party Spokesperson Pattabhi Went To Maldives-TeluguStop.com

పట్టాభి అరెస్టు తర్వాత టిడిపి  నేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగారు.దీనికి పోటీగా వైసిపి సైతం జానాగ్రహ దీక్ష చేపట్టింది.

ఇదిలా ఉంటే జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన పట్టాభి కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్ళడం, అక్కడ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

 Ycp Campaign As Telugudesam Party Spokesperson Pattabhi Went To Maldives-టీడీపీ పట్టాభి మాల్దీవులకు వెళ్లారా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన మాలేకు చేరినట్లు సమాచారం.ఆయన ఎయిర్ పోర్ట్ కి వెళ్లడం,  విమానంలో కూర్చున్న దృశ్యాలు , హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం తదితర వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలను వైసిపి సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుండడంతో,  ఏపీ వ్యాప్తంగా ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.
 

Telugu Ap, Ap Government, Bjp, Chandrababu, Jagan, Pattabhi Airport, Pattabhi Maldeev Tour, Pattabi, Tdp, Ysrcp-Telugu Political News

 ఏపీలో సంచలనం సృష్టించిన పట్టాభి వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు వీలైతే బిజెపి పెద్దలను కలిసి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.అలాగే రాష్ట్రపతిని కలిసిన సందర్భంలో రాష్ట్రపతి పాలన ఏపీ లో విధించాలంటూ ఆయన కోరడం వంటి వ్యవహారాలు జరిగాయి.అయితే పట్టాభి మాల్దీవులకు వెళ్లారని వైసిపి సోషల్ మీడియా విభాగం ప్రచారం పై టిడిపి సైలెంట్ గానే ఉంది.అయితే ఆయనపై మత్స్యకారులను దూషించిన కేసు నమోదవడంతోనే దాని నుంచి తప్పించుకునేందుకు మాల్దీవులకు ప్రయాణం అయినట్లుగా ప్రచారం నడుస్తోంది.

దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

#Pattabi #Chandrababu #Jagan #Ysrcp #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube