జ‌గ‌న్ అలాంటి ప‌నులు చేయడంతో ర‌గిలిపోతున్న వైసీపీ కేడ‌ర్‌..

ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న నిర్ణ‌యాలు గానీ ఏదంటే ప‌త‌కాలు గానీ బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి.ఇక పోతే ఇప్పుడు ప్ర‌జ‌ల్లో బాగానే ఆద‌ర‌ణ ఉన్నా గానీ ఇటు వైసీపీ నేత‌ల్లోనే టెన్ష‌న్ మొద‌లవుతోంది.

 Ycp Cadre Angry Over Jagan Doing Such Things  Ycp, Jagan  . Ap Poltics , Nominat-TeluguStop.com

ఎందుకంటే ఈ పార్టీలోకొన‌సాగుతున్న వారంతా కూడా ప‌దవుల విష‌యంగా బాగా నిరాశ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.దీంతో వారంతా కూడా జ‌గ‌న్ మీద కొంత అసంతృప్తితోనే ఉన్నారంట‌.

ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా చాలా మందికి నామినేటెడ్ ప‌ద‌వులు వ‌చ్చాయి.

అయితే ఆద‌ర‌ణ ఎంత ఉన్నా గానీ మెజార్టీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డంలా అనుకున్నంత స‌క్సెస్ కాలేద‌ని అంటున్నారు.

ఈ కార‌ణాల‌తో ఆ మెజారిటీ వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు అలాగే నాయ‌కులు కూడా పార్టీని న‌మ్ముకుని కొంత న‌ష్ట‌పోయిన‌ట్టు భావిస్తున్నారంట‌.ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉంటున్న నాయకులు ఎక్కువ‌గా ఆధిపత్య ధోరణిలో సాగుతుండ‌టంతో చాలా మందికి అన‌గా సెకండ్ గ్రేడ్ నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని భావిస్తున్నారు.

కాగా ఒకప్పుడు అయితే జ‌గ‌న్ పార్టీలో ఉంటున్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో అగ్ర నేత‌లు ఎవ‌రికి ఇవ్వ‌మంటే వారికి ఇచ్చేవారు.

Telugu Ap Poltics, Jagan, Ycp Cadre, Ycp, Ysrcp, Ysrcp Mlas-Telugu Political New

కానీ ఇప్పుడు అలా కాకుండా జ‌గ‌న్ స్వ‌యంగా రంగంలోకి దిగి మ‌రీ ప్ర‌జ‌ల్లో ఎవ‌రికి మంచి మార్కులు ఉంటే వారికే ప‌దువు క‌ట్ట‌బెడుతున్నారు.దీంతో ఎన్నికల సమయంలో ప‌ని చేసిన త‌మ‌ను కాద‌ని వేరే వారికి పదవులు క‌ట్ట‌బెట్ట‌డంతో వారంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆవేద‌న లోఉన్నారంట‌.ఇదే విష‌యాన్ని త‌మ ఎమ్మెల్యేల‌కు అలాగే మంత్రుల వ‌ర‌కు కూడా చెప్తున్నారని స‌మాచారం.

ఇక వైసీపీలో ఇప్పుడు అస‌లు యూత్‌ను ఆద‌రించే ప‌నులు పెద్ద‌గా చేయ‌ట్లేద‌ని క‌నీసం ఎలాంటి క‌మిటీలు కూడా వేయ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.దీంతో ఇప్పుడు సెకండ్ గ్రేడ్ నాయ‌కులు అంతా కూడా కొంత నిరాశ‌లోనే ఉన్నారంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube