ఆ నినాదాన్ని న‌మ్ముకుంటున్న‌ వైసీపీ.. రాబోయే ఎన్నిక‌ల్లో ఇదే ఎజెండా

ఏ రాజ‌కీయ పార్టీ అయినా ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ముందు ఒక నినాదాన్ని ఇస్తుంది.ఆ నినాదం ప్ర‌భావంతోనే గెలుపు, ఓట‌ములు ముడిప‌డి ఉంటాయి.

 Ycp Believes In That Slogan This Is The Agenda In The Upcoming Elections, Ycp, J-TeluguStop.com

ఈ విష‌యంలో వైసీపీది అందె వేసిన చేయి.గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన వైసీపీకి ఎంత పెద్ద విజ‌యం ద‌క్కిందో చూశాం.

ఇక ఇప్పుడు ఎన్నిక‌లకు రెండేళ్లు ఉండ‌గానే అన్ని పార్టీల ఇప్ప‌టి నుంచే రాబోయే ఎన్నిక‌ల కోసం రెడీ అవుతున్నాయి.ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నాయి.

దీంతో వైసీపీ కూడా ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్లాల‌నే దానిపై క‌స‌ర‌త్తులు చేస్తోంది.

గత ఎన్నికల స‌మ‌యంలో వైసీపీ ప్రత్యేక హోదా నినాదం బ‌లంగా వినిపించింది.

ఇది ప్ర‌జ‌ల్లోకి వెల్ల‌డంతో జ‌గ‌న్ భారీ మెజార్టీతో సీఎం అయ్యారు.కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక హోదా మాట పక్కన పెట్టేసినట్లే వైసీపీ పాల‌న ఉండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఇది వ్య‌తిరేక‌త తీసుకువ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

కాబ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల స‌మ‌యంలో దీన్ని ప‌క్క‌న పెట్టేయాల‌ని డిసైడ్ అయిపోయింది.ఇక రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌లో ఏ మాత్రం అభివృద్ధి జ‌రిగింద‌నే దానిపై అటు విపక్షాలు కూడా ఎన్నికల్లో టార్గెట్ చేసే అవ‌కాశం ఉంది.

Telugu Ap, Jagan, Ycp Slogan, Ysrcp-Telugu Political News

కాబ‌ట్టి ఆ విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టే విధంగా త‌మ నినాదం ఉండాల‌ని వైసీపీ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది.అదేంటంటే మూడు రాజధానులతో పాటుగా మూడు ప్రాంతాల డెవ‌ల‌ప్ మెంట్ అనే నినాదాన్ని ఎత్తుకుంటోంది.ఇది అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ చెప్పిన నినాదమే.కాగా మూడు రాజ‌ధానుల బిల్లుకు ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోయినా కూడా ఇదే నినాదాన్ని ఎత్తుకుంటున్నారు జ‌గ‌న్‌.

ఇక‌ కోర్టులో తీర్పులు ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం లేదు కాబ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల లోగా ఎలాగూ మూడు రాజ‌ధానుల‌పై గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేట్టు క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల దీన్నే నినాదంగా ఎత్తుకోవాల‌ని చూస్తున్నారు జ‌గ‌న్‌.మ‌రి ఈ నినాదం అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీసుకొస్తే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube