విజ‌య‌మ్మ ఆత్మీయ భేటీకి దూరంగా వైసీపీ.. కార‌ణం అదేన‌ట‌

వైసీపీ నేత‌ల‌ను ఇప్పుడు ఓ విష‌యం బాగా టెన్ష‌న్ పెడుతోంది.అదేనండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి క‌రంగా మారిన సెప్టెంబర్ 2 విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న ఆత్మీయ కార్య‌క్ర‌మం.

 Ycp Away From Vijayamma Spiritual Meeting  The Reason Is The Same  Ycp, Vijayamm-TeluguStop.com

ఇప్ప‌టికే అన్ని పార్టీల నేత‌ల‌కు ఆహ్వానాలు వెళ్ల‌గా వైసీపీకి చెందిన నేతలంతా కూడా ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.సెప్టెంబ‌ర్ 2న దివంగత సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 12వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని గ‌తానికి భిన్నంగా ఈసారి ఆయ‌న సతీమణి విజయమ్మ హైదరాబాద్ లో చేయ‌డ‌మే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆమె వివిధ పార్టీల్లో ఇప్పుడున్న ముఖ్యనేతలకు అన‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్యాబినెట్ కీల‌కంగా మంత్రి ప‌ద‌వులు చేప‌ట్ట‌ని వారంద‌రికీ ఆమె ఆత్మీయ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.

మంత్రులుగా చేసిన వారితో పాటు త‌మ‌కు త‌మ కుటుంబానికి సన్నిహితులు ఉంటున్న వారిని కూడా విజ‌య‌మ్మ ఈ ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.అయితే ఈ ఆహ్వానం అందుకున్నవారిలో ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, అలాగే వైసీపీల్లో కూడా ఇప్పుడు కీల‌కంగా ప‌నిచేస్తున్న వారంతా కూడా ఉన్నారు.

Telugu Ap Poltics, Ts Potics, Vijayamma, Ys Jagan, Ys Sharmila-Telugu Political

దీంతో ఇప్ప‌డు అస‌లు ఆమె ఎందుకు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.అన్ని పార్టీల్లో కూడా ఆమె ఆహ్వానానికి వెళ్లాలా వెళ్తే ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయ‌నే అనుమానాలు కొన‌సాగుతున్న‌నాయి.ఇక మ‌రీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స‌మ్మేళ‌నానికి రాక‌పోవ‌డంతో వైసీపీలో ఉంటున్న వారు కూడా ఈ ఆహ్వానాల‌ను అందుకున్న వారంతా దీనికి దూరంగానే ఉండాలని డిసైడ్ అయినట్లు స‌మాచారం.ఎందుకంటే భ‌విష్య‌త్ లో రాజకీయంగా స‌మ‌స‌మ్య‌లు వ‌స్తాయ‌నే భ‌యంతోనే వారంతా దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ఈ భేటీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube