ఇప్పుడు విశాఖ చుట్టూ ఏపీ పొలిటికల్ డ్రామాలు

ప్రశాంతమైన విశాఖ మహానగరం ఇప్పుడు వైసీపీ, టీడీపీ రాజకీయాలకి వేదికగా మారుతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.అమరావతిలో టీడీపీ సొంత పెత్తనంతో అక్కడ వైసీపీ పాలనకి, ఆ నాయకులకి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 Ycp And Tdp Political Game Moves To Visakhapatnam-TeluguStop.com

ఈ అమరావతి అంతా చంద్రబాబు సామాజిక వర్గం బలంగా ఉండటంతో అక్కడ జగన్ ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఉంది.దీనిని అవకాశంగా చేసుకొని కొత్త ప్రభుత్వం మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి పరిపాలన అంతా విశాఖలో తరలించే పని మొదలెట్టారు.

ఇక విశాఖసిటీపై పట్టు పెంచుకుంటున్న జగన్ ప్రభుత్వం అక్కడ ఆధిపత్యం అంతా తమదే ఉండే విధంగా చూసుకుంటుంది.

ఈ నేపధ్యంలో తాజాగా విశాఖలో చంద్రబాబు పర్యటనని వైసీపీ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని, అది ఉత్తరాంద్ర ప్రజల తిరుగుబాటుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం అక్కడ గొడవ చేసింది చంద్రబాబు మీద దాడి చేసింది అంతా వైసీపీ కార్యకర్తలు, పులివెందుల బ్యాచ్ సహాయంతో చేసారని వాదిస్తున్నారు.అయితే అధికార పార్టీ నేతలు మాత్రం విశాఖలో చంద్రబాబుని అడ్డుకున్న వారిలో పులివెందుల బ్యాచ్ ఎవరు లేరని, స్థానిక ప్రజలే విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న బాబుని అడ్డుకున్నారని అంటున్నారు.

అయితే విశాఖలో తమ బలం నిరూపించుకోవడానికి వైసీపీ ఇలా రాజకీయ క్రీడా మొదలెట్టింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పరిపాలన రాజధాని మాటున ఇప్పటికే విశాఖ వైసీపీ అడ్డాగా మారిపోయిందని, ఇక రెండు పార్టీలు పొలిటికల్ డ్రామాలని విశాఖ చుట్టూ తిప్పే పని మొదలెట్టారని అంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube