ఏపీలో వైసీపీ, టీడీపీ వితండ వాద‌న‌లు.. చంద్ర‌బాబు అలా.. జ‌గ‌న్ ఇలా

ఏపీలో ఇప్పుడు దుమారం రేగుతోంది.మొన్న‌టి దాకా కాస్త చ‌ప్ప‌చ‌ప్ప‌గా సాగిన రాజ‌కీయాలు కాస్తా ఇప్పుడు ఊపందుకున్నాయి.

 Ycp And Tdp In The Ap Are Arguing  Chandrababu Is Like That .. Jagan Is Like Tha-TeluguStop.com

అయితే ఎలాగోలా ప్ర‌జ‌ల్లో నానాల‌నే తాప‌త్ర‌య‌మో లేదంటే ఇంకేదైనా కావ‌చ్చు గానీ టీడీపీ నేత‌లు, ఇటు వైసీపీ నేత‌లు తిట్ల పురాణం ఎత్తుకున్నారు.దాంతో అవి కాస్తా హ‌ద్దులు దాటిపోయి విలువ‌లు మ‌రిచిపోయి మ‌రీ బూతులు తిట్టుకునే స్థాయి దాకా వారి రాజ‌కీయాలు దిగ‌జారిపోయాయి.

అయితే ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు చేస్తున్న వాద‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇంత రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న పార్టీలు ఇలాంటి వితండ వాద‌న‌లు చేయ‌డ‌మేంటని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఏపీలో హింస చెల‌రేగుతోంద‌ని కాబ్ట‌టి రాష్ట్రంలో అర్జంటుగా రాష్ట్రపతి పాలన విధించాలంటూ టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది.త‌మ మీద‌, త‌మ ఆఫీసుల మీద దాడులు జ‌రుగుతున్నాయ‌ని, కాబ‌ట్టి వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలంటూ తీవ్రంగా ఆరోపిస్తోంది టీడీపీ.

కానీ ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే టీడీపీ ఆఫీసుల మీద జ‌రిగిన దాడులు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగాయ‌ని చెప్ప‌డంతో పాటు అస‌లు దాడుల‌కు కార‌ణం వారి పార్టీ నేత‌లు చేస్తున్న తీవ్ర తిట్ల పురాణాలే అని కూడా చంద్ర‌బాబు మ‌ర్చిపోతున్నారు.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Jagan, Tdp, Ycp Tdp Ap, Ycp, Ysrcp-Telugu Politi

పైగా గ‌వ‌ర్న‌ర్ లేఖ రాయ‌కుండా రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎలా విధిస్తార‌నే విష‌యం కూడా ఆయ‌న మ‌ర్చిపోతున్నారు.ఇక వైసీపీ కూడా ఓ వింత వాద‌న చేస్తోంది.అదేంటంటే రాజ‌కీయ విలువ‌లు పాటించ‌కుండా రాష్ట్రంలో హింస‌కు ప్రేరేపిస్తుంది కాబ‌ట్టి టీడీపీ గుర్తింపు ర‌ద్దు చేయాలంటూ కోరుతోంది.అయితే త‌మ పార్టీ నేత‌లు కూడా బూతులు తిడుతున్నార‌నే విష‌యాన్ని మాత్రం వైసీపీ మ‌ర్చిపోతోంది.

పైగా వైసీపీ కంటే ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న పార్టీ గుర్తింపును ఈ మాత్రం గొడ‌వ‌కే ఎలా ర‌ద్దు చేస్తార‌నే వాద‌న కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.ఇలా రెండు పార్టీలు త‌మ స్థాయి మ‌ర్చిపోయి మ‌రీ వింత వాద‌న‌ల‌కు తెర లేపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube