ఫ్రీగా ఆడిస్తానంటూ పవన్ చేసిన కామెంట్లపై వైసీపీ స్పందన ఇదే.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజైన సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల జీవోను అమలులోకి తెచ్చింది.

 Ycp Ambati Rambabu Shocking Comments About Pawan Kalyan, Amabati Rambabu , Inte-TeluguStop.com

ఫలితంగా ఏపీలో టికెట్ రేట్లు ఊహించని స్థాయిలో తగ్గాయి.పవన్ తరువాత సినిమాల రిలీజ్ సమయంలో సైతం ఏపీ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.పంతానికి దిగితే ఏపీలో తన సినిమాలను ఉచితంగా చూపిస్తానంటూ పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీని దెబ్బకొట్టడం ద్వారా తన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని వైసీపీ భావిస్తోందని పవన్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సినిమాలను ఆపినా భయపడనని పవన్ చెప్పుకొచ్చారు.

సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని అయితే ప్రభుత్వం అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా? అని పవన్ ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలకు సినిమా టికెట్ కొనాలని మద్యం మాత్రం 700 రూపాయలు పెట్టి కొనాలంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.

ప్రజలు అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాల విషయంలో తిరగబడాలని పవన్ పిలుపునిచ్చారు.

Telugu Ambati Rambabu-Movie

వైసీపీ సర్కార్ ఒక్క శిలాఫలకం అయినా పెట్టిందా? ఒక్క ప్రాజెక్ట్ ను అయినా మొదలుపెట్టిందా? అంటూ పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చారు.ఏపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే భవిష్యత్తులో తన సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.పవన్ చేసిన కామెంట్ల గురించి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.

పవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఎంత చూపిస్తున్నారో చెప్పాలని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.ఏపీ ప్రభుత్వానికి పవన్ సినిమాలను అడ్డుకోవాల్సిన అవసరం లేదని ప్రేక్షకులకు మేలు చేయాలనే ఆలోచనతో ఆన్ లైన్ టికెట్ల విధానాన్ని అమలులోకి తెచ్చామని అంబటి రాంబాబు అన్నారు.

జగన్ మంచి చేస్తే ప్రశంసించడం పవన్ కు చేత కాదని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube