రఘురామకృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ అనేదానిపై స్పందించిన అంబటి రాంబాబు..!!

నరసాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేసింది.వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు అయినా గాని రఘురామకృష్ణంరాజు అరెస్టు పట్ల విపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 Ambati Rambabu Sensational Comments Ycp Mp Raghurama Krishnam Raju Arrest, Ysrcp-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా నిన్న న్యాయస్థానంలో హాజరైన సమయంలో.రఘురామకృష్ణంరాజు తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కాలికి తగిలిన దెబ్బలు చూపించడం జరిగింది.

దీంతో చాలామంది ఈవిషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు.దీనిలో భాగంగా తాజాగా ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కీలక కామెంట్లు చేశారు.

పోలీసులు చేయి చేసుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.ఎవరినైనా క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలి.

అది ఒక ప్రొసీజర్.

న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి.

కొన్ని ప్రశ్నలు వేస్తారు, వాటిలో ముఖ్యమైనవి పోలీసులు మీపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా.? లేకపోతే తప్పుగా ఏమైనా ప్రవర్తించారా.? అని ప్రశ్నిస్తారు.అప్పుడు.

ముద్దాయి చెప్పేదాన్ని రాసుకుంటారు తర్వాత రిమాండ్ విధిస్తారు.ఆ క్రమంలోనే ప్రస్తుత కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ముద్దాయి.

ఏపీ సిఐడి ఆయనపై కేసు రిజిస్టర్ చేయడం మాత్రమే కాక న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది.ఈ క్రమంలో సహజంగానే అక్కడున్న న్యాయమూర్తి ఈ కేసులో కూడా ప్రశ్నలు అడుగుతారు.

ఈ విషయం పోలీసులుకి తెలిసు… న్యాయమూర్తికి అదేవిధంగా రఘురామకృష్ణంరాజు కూడా తెలిసి ఉంటది.

ఏపీ సిఐడి కి కేసుకు సంబంధించి చాలా విషయాలు తెలిసిన తర్వాత.

కూడా  కోర్టులో ప్రవేశపెట్టక ముందు.ఆయనపై చేయి ఎందుకు చేసుకుంటారు.? కోట్టాల్సిన అవసరం పోలీసులకు లేదు.ఇలాంటి తరుణంలో రఘురామకృష్ణంరాజు.

Telugu Ambati Rambabu, Ap Cid, Ap, Criminal, Jagan, Jail, Sapuram Mp, Degree, Yc

 థర్డ్ డిగ్రీ పోలీసులు చేశారంటూ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తుగడ అని అంబటి రాంబాబు ఆరోపించారు.జనరల్ గా న్యాయస్థానం రిమాండ్ విధించిన తర్వాత జైలుకు పంపిస్తారు.జైలుకు వెళ్లకుండా హాస్పిటల్ లోకి వెళ్ళటం కోసం థర్డ్ డిగ్రీ అనే కొత్త ఎపిసోడ్ రఘురామకృష్ణంరాజు తెరపైకి తెచ్చినట్లు తాను భావిస్తున్నట్లు అంబటి స్పష్టం చేశారు.అదే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించవచ్చు అని పోలీసులపై కూడా నింద వేయొచ్చని .ఇదంతా రఘురామకృష్ణంరాజు కావాలని చేస్తున్నట్లు తెలిపారు.అసలు పోలీసులకి ఆయనను కొట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

 ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడం కోసం ఇటువంటి నాటకాలు ఆడితే .భవిష్యత్తులో విలువ ఉండదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube