యాత్రను బాగానే కొన్నారుగా... ఊహించని విధంగా బిజినెస్‌ అయ్యింది  

వైఎస్‌ ఆర్‌ బయోపిక్‌ ‘యాత్ర’ విడుదలకు సిద్దం అయ్యింది, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బడ్జెట్‌ దాదాపుగా రికవరీ అయినట్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 14 కోట్ల బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ రైట్స్‌, ఈ రైట్స్‌ అంటూ మరో ఆరు నుండి ఏడు కోట్ల వరకు వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంది.

Yatra Movie Free Business Make More Profit-Telugu Biopic Yatra Release Date Ycr Ys Jagan Ys Vijayamma

Yatra Movie Free Business Make More Profit

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా ఊహించిన రేటు కంటే ఎక్కువ పలికింది. మొదట ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. కాని సినిమా విడుదలకు సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా మంచి ప్రమోషన్స్‌ చేసి సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు. ఆ కారణంగానే సినిమాను విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు మంచి రేటు పెట్టి కొనుగోలు చేశారు.

ఏరియాల వారిగా ఈ చిత్రం చేసిన బిజినెస్‌ వివరాలు ఇలా ఉన్నాయి :
నైజాం : 3.3 కోట్లు

Yatra Movie Free Business Make More Profit-Telugu Biopic Yatra Release Date Ycr Ys Jagan Ys Vijayamma

సీడెడ్‌ : 2.21 కోట్లు

ఆంధ్ర : 5.50 కోట్లు

ఓవర్సీస్‌ : 2.0 కోట్లు

ఇతరం : 50 లక్షలు

మొత్తం : 13.51 కోట్లు