బన్నీ లిస్టులో కొత్త డైరెక్టర్.. యాత్ర మొదలెడతాడా..?  

Yatra Movie Director To Direct Allu Arjun, Allu Arjun, Yatra, Mahi V Raghava, Sukumar, Tollywood News - Telugu Allu Arjun, Mahi V Raghava, Sukumar, Tollywood News, Yatra

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో బన్నీ మరోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Yatra Movie Director To Direct Allu Arjun

కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఎంపిక చేసే పనిలో బన్నీ పడ్డాడట.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రంగా వచ్చిన ‘యాత్ర’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించడంతో చిత్ర దర్శకుడు మహి వి రాఘవ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

బన్నీ లిస్టులో కొత్త డైరెక్టర్.. యాత్ర మొదలెడతాడా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ డైరెక్టర్ బన్నీ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేసి వినిపించగా, బన్నీకి ఆ కథ బాగా నచ్చిందట.ఈ సినిమాను చేసేందుకు బన్నీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో పీవీపీ బ్యానర్‌లో ‘సిండికేట్’ అనే సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపాడు ఈ డైరెక్టర్.
కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో, ఇప్పుడు అదే సినిమాను బన్నీకి వినిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాను బన్నీ నిజంగానే ఒప్పుకుంటాడా, లేక ఇది కూడా ఇతర వార్తల్లాగా పుకారుగా మాత్రమే మిగులుతుందా అనేది చూడాలి.ఇక బన్నీ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే.

#Yatra #Sukumar #Allu Arjun #Mahi V Raghava

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yatra Movie Director To Direct Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..