'యాత్ర'కు పెట్టుబడి ఎంత? వస్తున్నది ఎంత? అవాక్కయ్యేలా ఉన్న లెక్కలు  

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను దక్కించుకుంది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 6 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం మరింతగా వసూళ్లు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో మమ్ముటీ తన పాత్రకు జీవం పోశాడని, నిజంగా రాజశేఖర్‌ రెడ్డిని దించేశాడని, దర్శకుడు మహి వి రాఘవ గారు రాజశేఖర్‌ రెడ్డి గారిపై జనాల్లో ఉన్న అభిమానంను లేపే విధంగా సినిమా తీశాడు అంటూ చెప్పుకుంటున్నారు.

Yatra Movie Budget And Income For Before Release The Movie-Yatra Moie Collections Yatra Date Ys Jagan Ysr Biopic

Yatra Movie Budget And Income For Before Release The Movie

సినిమాకు ఈ స్థాయిలో పాజిటివ్‌ బజ్‌ వచ్చిన కారణంగా సినిమాను అమాంతం ఎత్తుకు ఎత్తేస్తున్నారు. సినిమా కలెక్షన్స్‌ చూస్తుంటే నిర్మాతలు కూడా నమ్మలేక పోతున్నారు. ఈ చిత్రంను దాదాపు 15 కోట్లకు కాస్త అటు ఇటుగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. పబ్లిసిటీ ఖర్చులు అన్నింటితో కలిపి 15 కోట్లతో పూర్తి చేసిన నిర్మాతలు ఈ చిత్రంను అన్ని ఏరియాలకు కలిపి 10 కోట్లకు అమ్మారు. సినిమా విడుదల తర్వాత ఆ మొత్తం వస్తుందని వారు ఊహించారు. అయితే సినిమా కలెక్షన్స్‌ మొదటి వారంలోనే రికవరీ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Yatra Movie Budget And Income For Before Release The Movie-Yatra Moie Collections Yatra Date Ys Jagan Ysr Biopic

ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఈ చిత్రాన్ని ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. స్టార్‌ హీరో మూవీ స్థాయిలో ఈ చిత్రం అమ్ముడు పోవడంతో నిర్మాతలు ఫుల్‌ హ్యాపీ. ఇక శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీగానే అమ్ముడు పోయే అవకాశం ఉంది. ప్రైమ్‌ వీడియో రైట్స్‌ కాకుండి ఇతర రైట్స్‌ ద్వారా 10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే కలెక్షన్స్‌ రూపంలో కాకుండానే ఈ చిత్రం 18 కోట్లను రాబట్టనుంది. అంటే బడ్జెట్‌ను మించి ఈ రైట్స్‌ వల్లేనే రాబోతుంది. ఇక కలెక్షన్స్‌ రూపంలో 15 నుండి 17 కోట్ల వరకు రాబట్టవచ్చు. అంటే మొత్తంగా నిర్మాతకు ఈ చిత్రం 20 కోట్ల వరకు లాభాలను తెచ్చి పెడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బయోపిక్‌ లు ఈస్థాయిలో లాభాలను తెచ్చి పెట్టడం చాలా అరుదగా చెప్పుకోవాలి. మహానటికి వచ్చింది మళ్లీ ఇప్పుడు యాత్రకు దక్కింది.