భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన యష్ మాస్టర్.. అదే ఏమిటంటే?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ ప్రోగ్రామ్స్ ఎంతోమంది డాన్సర్ లను మంచి స్థాయిలో నిలబెట్టింది.తమకంటూ ఓ గుర్తింపును అందించింది.

 Choreographer Yashwant Master Memorable Gift To Wife Varsha, Yashwant Master, Me-TeluguStop.com

ఈ షో ద్వారా పరిచయమైన యంగ్ టాలెంట్ యశ్వంత్ మాస్టర్ ఇందులో మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా సినిమాల్లో కూడా కొరియోగ్రాఫర్ చేశారు.

ఇక ప్రస్తుతం అటు వెండితెర కొరియోగ్రాఫర్ గా ఇటు బుల్లితెర జడ్జిగా బిజీ గా మారాడు.


ఇక ఈయన గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తన చిన్ననాటి స్నేహితురాలు వర్షను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.ఇక వీరి ప్రేమ దాదాపు 8 సంవత్సరాలు సాగింది.

ఇక వర్ష ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుంది.ఇక ఈమెను కూడా బుల్లితెర డాన్స్ ప్రోగ్రాంలో యష్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వర్ష తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా కొన్ని షోలలో అతిథి పాత్రలలో కూడా ఈ జంట పాల్గొని బాగా సందడి చేశారు.


ఇక వారి పెళ్లి జరిగి నిన్నటితో రెండేళ్లు అవ్వగా.వారి 2 వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు.అంతేకాకుండా వారి పరిచయం అయినా స్పెషల్ డేట్ నుండి కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా ఆయన అభిమానులకు షేర్ చేసుకున్నాడు.ఇక తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని విషయాలను పంచుకోగా.

ఆమెకు తమ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఒక కుక్క పిల్లని ఇచ్చాడట.ఇక ఈ విషయం గురించే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

అంతేకాకుండా ఆయన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube