ఈ బుల్లితెర నటి యాంకర్ సుమకు ఏం అవుతుందో తెలుసా?  

karthika deepam serial, doctor babu, navya swami kanakala, yashvi kanakala, anchor suma, rajiv kanakala - Telugu Anchor Suma, Doctor Babu, Karthika Deepam Serial, Navya Swami Kanakala, Rajiv Kanakala, Yashvi Kanakala

బుల్లితెర స్టార్ యాంకర్ ఎవరు? అని ప్రశ్న వేస్తే చాలు టక్కున కళ్ళుమూసుకొని చెప్పేస్తారు యాంకర్ సుమ అని.ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎన్నో అద్భుతమైన షోలను చేసింది.

TeluguStop.com - Yashvi Kanakala Rajiv Kanakala Suma Kanakala

స్టార్ మహిళ, క్యాష్, భలే ఛాన్సులే వంటి ప్రోగ్రామ్స్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న యాంకర్ సుమ వయసు పైబడిన సరే ఎంతో అందంగా కనిపిస్తూ బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది.అయితే యాంకర్ సుమనే కాదు.

ఆమె బంధువులు కూడా ఎంతోమంది బుల్లితెరపై నటిస్తున్నారు.

TeluguStop.com - ఈ బుల్లితెర నటి యాంకర్ సుమకు ఏం అవుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలానే పైన కనిపిస్తున్న బుల్లితెర నటి కూడా సుమకు బంధువే అవుతుందట.

సుమకు ఈ నటి మరదలు అవుతుందట.అంటే సుమ భర్త అయిన రాజీవ్ కనకాలకు చెల్లి వరస అవుతుందట.

ఈమె పేరు యశ్వి కనకాల. నిజమైన పేరు నవ్య స్వామి కనకాల అయినప్పటికీ ముద్దుపేరు అయిన యశ్వి కనకాల అని ఇండస్ట్రీలో పేరు సంపాదించింది.

బుల్లితెరపై నెగటివ్ పాత్రల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బుగ్గల బ్యూటీ.

రాజీవ్ కనకాల కజిన్ సిస్టర్ అయినప్పటికీ ఆ పేరు పైన కాకుండా సొంతంగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది ఈ నటి.అయితే ఈమె కార్తీక దీపం సీరియల్ లో మోనిత స్నేహితురాలు శ్రీలతగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ నటి జెమినీ టీవీ, ఈటీవి, జీటీవీ అని తేడా లేకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విలన్ పాత్రలో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవుతుంది.జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న తాళి అనే సీరియల్ లో కూడా అద్భుతంగా విలన్ పాత్రలో నటిస్తోంది ఈ నటి. ప్రస్తుతం విలన్ పాత్రల్లో మెరుస్తున్న ఈ భామ ఇకపైన అయినా లీడ్ పాత్రల్లో నటిస్తుందేమో చూడాలి.

#Anchor Suma #NavyaSwami #KarthikaDeepam #Doctor Babu #Yashvi Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yashvi Kanakala Rajiv Kanakala Suma Kanakala Related Telugu News,Photos/Pics,Images..