చెన్నైలో బీస్ట్ కు షాక్ ఇచ్చిన కేజిఎఫ్ వసూళ్లు.. ఎంత రాబట్టిందో తెలిస్తే..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

 Yash S Kgf Chapter 2 Overtakes Thalapathy Vijay S Beast In Tamil Nadu , Yash , K-TeluguStop.com

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో యష్ యాక్టింగ్ తో మరోసారి దుమ్ము లేపేసాడు.అలాగే ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ తో అదర గొట్టాడనే చెప్పాలి.దీంతో ఏ ఇండస్ట్రీలో చుసిన ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తుంది.

Telugu Beast, Bollywood, Chennai, Kgf Chapter, Prashant Neel, Tamil Nadu, Yash-M

అయితే ఈ సినిమా కంటే ముందు రోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమా కుడి భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే కెజిఎఫ్ కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా భవితవ్యం తేలిపోయింది.ఈ రెండు సినిమాలు రిలీజ్ కు ముందు నువ్వా నేనా అన్నట్టు ప్రొమోషన్స్ సాగాయి.

Telugu Beast, Bollywood, Chennai, Kgf Chapter, Prashant Neel, Tamil Nadu, Yash-M

కానీ రిలీజ్ తర్వాత వన్ సైడ్ అయిపొయింది.సొంత రాష్ట్రము లో కూడా బీస్ట్ ప్రభావం చూపించలేక పోయింది.దీంతో కేజిఎఫ్ ముందు బీస్ట్ సినిమా ఎక్కడ నిలవలేదు.అయితే తాజాగా బీస్ట్ సినిమాకు కెజిఎఫ్ షాక్ ఇచ్చింది.విజయ్ బీస్ట్ ఉండడంతో కెజిఎఫ్ తమిళనాట వసూళ్లు రాబట్టడం కష్టమే అన్నారు.కానీ ఇప్పుడు చుస్తే బీస్ట్ నే కష్టం అంటున్నారు.

ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.నిన్న సోమవారం రోజు చెన్నై లో కెజిఎఫ్ కి 62 లక్షలు వచ్చాయి.

బీస్ట్ మాత్రం కేవలం 36 లక్షల తోనే సరిపెట్టుకుంది.దీంతో అక్కడ ఈ సినిమాలు హాట్ టాపిక్ అయ్యాయి.

మరోసారి బీస్ట్ ను కెజిఎఫ్ దెబ్బకొట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube