ధూమ్ 4లో ప్రభాస్ కోసం యష్ రాజ్ ప్రయత్నాలు… మళ్ళీ తెరపైకి  

Yashraj Films To Announce A Film With Hrithik and Prabhas, Tollywood, bollywood, Indian Cinema, Pan India,Prabhas, Hrithik Roshan, Dhoom Series, Dhoom4 - Telugu Bollywood, Dhoom Series, Dhoom4, Hrithik And Prabhas, Hrithik Roshan, Pan India, Prabhas, Yashraj Films, Yashraj Films To Announce A Film With Hrithik And Prabhas

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.అతని ఇమేజ్ కూడా అన్ని భాషలకి విస్తరించింది.

TeluguStop.com - Yashraj Films To Announce A Film With Hrithik And Prabhas 4

ప్రభాస్ సినిమా అంటే భాషలకతీతంగా ప్రేక్షకులు నీరాజనాలు పడతారు.అలాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీయాలంటే ఇప్పుడు బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే పెట్టుకోవాలి.

ఇప్పుడు హిందీ దర్శకులు కూడా తమ సినిమాలకి పాన్ ఇండియా ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో సౌత్ భాషలపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు.

TeluguStop.com - ధూమ్ 4లో ప్రభాస్ కోసం యష్ రాజ్ ప్రయత్నాలు… మళ్ళీ తెరపైకి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే హిందీతో పాటు దేశ వ్యాప్తంగా ఇతర భాషల మార్కెట్ ని కూడా తెచ్చుకోవాలని పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టి సౌత్, నార్త్ కాంబినేషన్ లకి ప్రాధాన్యత ఇస్తున్నారు.గతంలో సౌత్ హీరోలని చిన్న చూపు చూసే హిందీ పరిశ్రమ ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుంది.

ఇదంతా కేవలం సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడమే.
ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి.

ఈ నేపధ్యంలో ధూమ్ సిరీస్ లో భాగంగా తెరకెక్కనున్న నాలుగో పార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తుంది.దీనికోసం హృతిక్ రోషన్ తో పాటు మరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

దానికోసం డార్లింగ్ ప్రభాస్ ని సంప్రదిస్తున్నారని సమాచారం.గతంలో ఈ ప్రాజెక్ట్ విషయంపై చర్చ జరిగిన ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాలేక వదులుకున్నాడు.అయితే ఎలా అయినా ఈ సినిమాలో అతనితో నటింప జేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.దానికోసం మళ్ళీ సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది.

ప్రభాస్ ఉంటే ఇంటెర్నేషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుందని భావించి అతని డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

#Prabhas #Pan India #Dhoom Series #Hrithik Roshan #Yashraj Films

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yashraj Films To Announce A Film With Hrithik And Prabhas 4 Related Telugu News,Photos/Pics,Images..