Samantha Yashoda : యశోద ఓవర్సీస్ రెస్పాన్స్ అదుర్స్.. సామ్ సాలిడ్ హిట్ అందుకున్నట్టే!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలను లైన్లో పెట్టి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తుంది.మరి ఈమె నటించిన లేటెస్ట్ సినిమాల్లో ‘యశోద’ సినిమా ఒకటి.

 Yashoda Gets A Biggest Opening In Usa, Usa, Usa Premieres, Samantha, Yashoda ,di-TeluguStop.com

ఈ సినిమా కోసం సామ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ క్రమంలోనే ఈ రోజు మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

అయితే ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేశారు.మరి ఈ ప్రీమియర్స్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించు కున్నట్టు తెలుస్తుంది.60 వేల డాలర్స్ కి పైగానే యశోద యూఎస్ ప్రీమియర్స్ కు రాబట్టినట్టు టాక్.మొత్తానికి సామ్ కష్టం వృధా అవ్వలేదు.ఈ సినిమా మంచి టాక్ తో సాలిడ్ హిట్ అందుకుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయం సాధించడం ఖాయం.

యశోద సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు మంచి విజయం సాదించేలాగానే కనిపిస్తుంది.

Telugu Hari Harish, Hariharish, Samantha, Usa, Yashoda, Yashodabiggest-Movie

ఇక సమంత ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అని టాక్.అలాగే ఎప్పటి లాగానే ఈమె తన నటనతో సినిమాకు వెన్నెముక గా నిలిచి హిట్ అవ్వడంతో కీలక పాత్ర పోషించింది.ఒకవైపు సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్న కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

ఈమె ఆ స్థితిలో కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం సినిమా ఓపెనింగ్స్ బాగా రావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చూడాలి తెలుగులో ఈ సినిమా ఎలా రాణిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube