మీ టూ: దేవరకొండ హీరోయిన్‌ కూడా   Yashika Anand Revealed Her MeToo Moments     2018-10-30   09:38:49  IST  Ramesh P

విజయ్‌ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన యాషిక ఆనంద్‌ తాజాగా మీ టూ పై స్పందించింది. ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఫేం లేకున్నా కూడా తమిళంలో మంచి పేరు ఉంది. తాను పని చేసిన సినిమా దర్శకుడు తనను లైంగికంగా వాడుకోవాలనుకున్నాడు అంటూ యాషిక చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు సూటిగా ఈ విషయం గురించి చెప్పకుండా తన చేష్టలతో మనసు పడ్డాడని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఆ దర్శకుడికి దూరంగా ఉంటూ వచ్చాను. ఇది పసిగట్టిన దర్శకుడు ఆ తర్వాత పలు చేష్టలతో నన్ను ఇంప్రెస్‌ చేయాలనుకున్నాడు. అయినా కుదరక పోవడంతో వదిలేశాడు అంటూ యాషిక చెప్పుకొచ్చింది.

‘నోటా’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన యాషిక ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. కొన్ని ప్రాజెక్ట్‌లకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మీ టూ లో భాగంగా యాషిక లైంగిక ఆరోపణలు చేసి ఆ దర్శకుడి పేరు బయట పెట్టకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. యాషిక కేవలం పబ్లిసిటీ కోసమే దర్శకుడు అంటూ ఆరోపణలు చేసింది తప్పా అందులో వాస్తవం ఉండి ఉండదు అంటూ పలువరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది చూసిన తర్వాత అయిన యాషిక దర్శకుడి పేరు చెబుతుందా లేదా సైలెంట్‌ అవుతుందా అనేది చూడాలి.

Yashika Anand Revealed Her MeToo Moments-

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం తారా స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో యాషిక లేవనెత్తిన అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ దర్శకుడు ఎవరు చెప్పు అంటూ సోషల్‌ మీడియాలో జనాు ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. అటువంటి దర్శకుల పేర్లు బయటకు చెప్పడమే మీటూ ఉద్యమం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలి, మరోసారి ఆ దర్శకుడు ఇతరుల పట్ల కామ వాంచ చూపించకుండా ఉంటాడు అంటూ నెటిజన్స్‌ యాషికతో అంటున్నారు. కాని యాషిక మాత్రం వాటికి రెస్పాండ్‌ అవ్వడం లేదు.