బిగ్ బాస్ కంటెస్టెంట్ లైసెన్స్ సీజ్.. ఎవరిదంటే?

గత రెండు రోజుల క్రితం పాండిచ్చేరి నుంచి చెన్నైకి ఈస్ట్ కోస్ట్ రోడ్ మీదుగా కారులో ప్రయాణం చేస్తున్నటువంటి నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ యాషికా ఆనంద్ కారు మల్లాపురం సెంటర్ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ ప్రమాదంలో నటి తీవ్రగాయాలు కాగా ఒకరు మృతి చెందారు.

 Yashika Anand Driving License Seized-TeluguStop.com

ఈ ప్రమాదం జరిగినప్పుడు యాషికా ఆనంద్ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు.

యాషికా ఆనంద్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో విచారించగా.

 Yashika Anand Driving License Seized-బిగ్ బాస్ కంటెస్టెంట్ లైసెన్స్ సీజ్.. ఎవరిదంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు యాషికా మద్యం సేవించలేదని పోలీసులు గుర్తించారు.కేవలం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కారు ప్రమాదం జరిగినప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్లనే అదుపుతప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Telugu Actress Yashika Aannand, Bigg Boss Contestant, Bigg Boss Fame, Chennai Police, Driving Licence, Drunk And Drive, No Seat Belt, One Died, Seized, Yashika Anand Car Accident-Movie

ఈ క్రమంలోనే యాషికా ఆనంద్ స్నేహితురాలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరగగానే ఆమె ఎగిరి బయటపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో యాషికా ఆనంద్ కి కాలు ఎముక పెరిగిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ఈ విధంగా కారు ప్రమాదానికి అధిక వేగమే కారణమని గుర్తించిన పోలీసులు ఆమె లైసెన్సులు రద్దు చేశారు .అదేవిధంగా నటి పై పలు కేసులను నమోదు చేసి కేసులు ముగిసేవరకు తను ఎలాంటి వాహనాలు నడపకూడదనే ఉద్దేశంతో మహాబలిపురం పోలీసులు నటి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లుగా తెలియజేశారు.

#BiggBoss #Belt #Licence #Seized #ActressYashika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు