యష్, ప్రభాస్, ఎన్టీఆర్ బ్లాక్ థీమ్ స్టోరీ.. సౌత్ ఇండియాలో ట్రెండ్?

ప్రస్తుతం దక్షిణాది లో హాట్ టాపిక్ గా మారిన పేరు బ్లాక్ థీమ్.అలాగే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు ప్రస్తుతం దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా మారుమోగుతోంది.

 Yash Prabhas Ntr Black Theme , Yash , Prabhas, Jr Ntr, Black Theme-TeluguStop.com

ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 1, సినిమా 2018 లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం ఉంచడమే కాకుండా రాకింగ్ స్టార్ యష్ ని కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.

ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల అయి వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లోనూ సంచలనాలు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఒకే విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

ఇప్పటికే బాలీవుడ్ లో దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా మంచి వసూళ్లు రాబట్టింది.కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండియాలోనే అత్యధిక శాతం ప్రేక్షకులను వీక్షించిన సినిమాగా కూడా రికార్డులు సాధిస్తోంది.

వరల్డ్ వైడ్ గా దాదాపుగా 1200 కోట్ల మార్కు వసూళ్లని రాబట్టి మరో రికార్డులు బాట పట్టింది.త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 3 కి సంబంధించిన షూటింగ్ ని ప్రారంభించబోతున్న ట్లు నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే దర్శకుడు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చాప్టర్ 1,2 లను బ్లాక్ థీమ్ తో తెర పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.ప్రశాంత్ నీల్ ఈ సినిమా తరువాత మరోసారి అదే ఫార్ములాతో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 30 శాతం పూర్తయింది.

Telugu Black Theme, Jr Ntr, Prabhas, Yash-Movie

త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ థీమ్ తో విడుదల చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్ ఇచ్చారు.పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా వయిలెంట్ గా కొత్తగా వుండటం కేజీఎఫ్ కేజీఎఫ్ 2 సంచలన విజయాల్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే.ఇది ఎలా వుండబోతోంది.

ఇంతకీ ఈ మూవీ థీమ్ ఏంటీ అనే చర్చ మొదలైంది.మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ రోజు ప్రశాంత్ నీల్ నుంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూశారు.

అంతా ఎదురుచూసినట్టే ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శుక్రవారం విడుదల చేశారు.బ్లాక్ థీమ్ తో బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ చేస్తున్న ప్రశాంత్ నీల్ .తాజాగా ఎన్టీఆర్ సినిమాకు కూడా అదే థీమ్ ని ఎంచుకున్నాడంటే ఈ సినిమా కూడా కే జి ఎఫ్ సినిమా స్టైల్ లోనే ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube