ఢీ కంటెస్టెంట్ మృతి.. యశ్ మాస్టర్ ప్రయత్నాలు వృధా.. జీవితాంతం ఈ బాధ ఉంటుందంటూ?

ఢీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొంత కాలం నుంచి యశ్ మాస్టర్ ఢీ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కేవల్ అనే డాన్సర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని…అతనిని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు సాయంగా ఆర్థికసహాయం చేయండి అంటూ ఎంతో మంది సెలబ్రిటీలను సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.

 Yash Master Emotional On Dhee Fame Kewa Tamang Death Details,  Dhee , Yash Maste-TeluguStop.com

అదేవిధంగా కేవల్ బ్లడ్ గ్రూప్ చెబుతూ తనకు బ్లడ్ అవసరం ఉందని.తనకు బ్లడ్ ఇచ్చి బతికించండి అంటూ ఎంతో మంది అభిమానులను వేడుకున్నారు.

ఈ క్రమంలోనే యశ్ మాస్టర్ పిలుపుమేరకు ఎంతోమంది అభిమానులు కేవల్ ను బ్రతికించడం కోసం బ్లడ్ డొనేట్ చేయడం అదేవిధంగా ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న అటువంటి ప్రియమణి, పూర్ణ వంటివారు సోషల్ మీడియా ముందుకు వచ్చి తనకు సహాయం చేయాలని చెప్పడమే కాకుండా కేవల్ కి సహాయం చేశారు.అదేవిధంగా సీరియల్ నటి మేఘన కూడా కేవల్ ఆరోగ్యం కోసం తనవంతు సహాయం చేసింది.

ఇలా తనను బ్రతికించుకోవాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆరాటపడ్డారు.అయితే యశ్ మాస్టర్ పడిన శ్రమ మొత్తం వృధా అయినట్టు తెలుస్తోంది.

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కంటెస్టెంట్ కేవల్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలిసిన మాస్టర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా కేవల్ మరణ వార్త విన్న మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.“నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నాను… ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

ఇప్పటికీ నువ్వు ఉన్నట్టుగానే అనిపిస్తోంది.మమ్మల్ని అందరిని ఒంటరి చేసి ఎంతో త్వరగా వెళ్ళి పోయావ్” అంటూ యశ్ మాస్టర్ చేసిన పోస్ట్ అందరిని కలచివేస్తోంది.ఈ క్రమంలోనే ఈ పోస్టు చూసిన నెటిజన్లు అతని ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube