ఆ రెండు రాష్ట్రాలకు తీవ్ర ముప్పుగా మారుతున్న యాస్ తుఫాన్.. !

మనుషులు తమ మనుగడకోసం ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగం సంగతి దేవుడెరుగు, కానీ తాను సౌకర్యవంతంగా జీవించడం కోసం ప్రకృతిని నాశనం చేశాడు.తెలియకుండానే విధ్వంసానికి మూల కారణం అయ్యాడు.

 Yash Hurricane Is Becoming A Serious Threat To Those Two States, Yash Hurricane,-TeluguStop.com

దీని ఫలితాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.అయినా అతనిలోని ఆశ చావడం లేదు.

ఇప్పటికే ప్రయోగాల పేరుతో అంతరిక్షాన్ని కూడా వ్యర్ధపదార్ధాలతో నింపేస్తుండగా, ఆకాశంలో లెక్కలేనని శకలాలు ఉన్నాయని ఒకగానొక సంధర్భంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఇలా మనిషి చేసుకున్న ఫలితం వల్ల అతివృష్టి, అనావృష్టి ఈ భూమి మీద ప్రజలను కష్టాల పాలు చేస్తుంది.

ఇకపోతే మొన్నటి వరకు వణికించిన తుఫాన్‌లు చాలదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన యాస్ తుఫాన్ వల్ల బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర ముప్పు ఉన్నదంటున్నారు.ఇకపోతే తూర్పు మధ్య బంగాళా ఖాతం లో తీవ్ర తుఫాన్ గా మారిన యాస్.

పారాదీప్ కు దక్షిణ-ఆగ్నేయంలో 320 కి.మీ.బాలాసోర్ కి ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యి, రేపు అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరం దాటే చాన్స్ ఉన్నట్లు సమాచారం.కాగా ఇప్పటికే ఒడిశా హై అలెర్ట్ ప్రకటించింది.మరి ఈ యాస్ తుఫాన్ విధ్వంసం ఏ స్దాయిలో ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube