ఈ సినిమానే ఈ రేంజ్ లో ఉంటే మరి కేజిఎఫ్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో..?

కేజిఎఫ్ సినిమాతో యష్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో యష్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.

 Yash Craze Increasing In Telugu States-TeluguStop.com

ఈయన కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.

కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ పేరు, యష్ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా వినిపిస్తున్నాయి.

 Yash Craze Increasing In Telugu States-ఈ సినిమానే ఈ రేంజ్ లో ఉంటే మరి కేజిఎఫ్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు.

సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో రాఖీ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ ఇప్పుడు కెజిఎఫ్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.

నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రాఖీ బాయ్ లవర్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.

అయితే యష్ కొన్ని సంవత్సరాల క్రితం చేసిన గజకేసరి సినిమా ఇప్పుడు విడుదల కాబోతుంది.కేజిఎఫ్ హిట్ తో ఒక్కసారిగా మార్కెట్ పెంచుకున్న యష్ ఎప్పుడో నటించిన సినిమాను కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నాడు.

తెలుగులో కూడా ఈయనకు బాగానే ఫాలోయింగ్ పెరిగింది.గజకేసరి సినిమాకు దాదాపు 300 థియేటర్లు లభించడం తో యష్ స్టామినా ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియదు కానీ అతడి క్రేజ్ కారణంగా భారీగా థియటర్స్ లభించాయి.ఇప్పుడే ఇన్ని థియేటర్స్ లభిస్తే మరి కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాకు మరెంత రేంజ్ లో థియేటర్స్ లభిస్తాయో అని క్రిటిక్స్ ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా జులై 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#KGF2 #Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు