పొలం పనుల్లో బిజీగా ఉన్న కేజీఎఫ్ స్టార్

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్.కన్నడ ఇండస్ట్రీలో నటుడుగా తన ప్రస్తానం మొదలు పెట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా రేంజ్ లో తన ఐడెంటిటీ చూపించుకున్నారు.

 Yash Buys Property In His Home Town-TeluguStop.com

ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2తో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.ఈ సినిమా తర్వాత యష్ చేయబోయే సినిమా మీద చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా కన్నడ యంగ్ డైరెక్టర్ నార్తన్ కి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం కేజీఎఫ్ 2 షూటింగ్ ముగించుకొని ఖాళీగా ఫ్యామిలీతో యష్ టైం స్పెండ్ చేస్తున్నాడు.

 Yash Buys Property In His Home Town-పొలం పనుల్లో బిజీగా ఉన్న కేజీఎఫ్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రీసెంట్ గా తన సొంతూరు హసన్‌ లో ఈ మధ్యనే యష్‌ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని తెలుస్తుంది.వీటి విలువ 80 కోట్ల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

ఈ పొలం విషయంలో హీరో కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగి విషయం జిల్లా కలెక్టర్‌ వరకు వెళ్లింది.ఇక రీసెంట్ గా సొంతూరు వెళ్లి యష్ దగ్గరుండి తన పొలానికి సంబందించిన పనులని చేయించాడు.

దానికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.యష్ ఫ్యాన్స్ వాటిని షేర్ చేసుకుంటూ తమ హీరో గొప్పతనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇక యష్ కోసం సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ్ బాషకి చెందిన దర్శక, నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు.అతని డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

అయితే వీరిలో ఎవరికీ ఒకే చెప్పాడనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

#Sandalwood #Home Town #KGFChapter #Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు